Share News

తీరొక్క పూలజాతర

ABN , Publish Date - Oct 19 , 2026 | 01:28 AM

సద్దుల బతుకమ్మ వేడుకలు జిల్లావ్యాప్తంగా ఆదివారం అంగరంగ వైభవంగా జరిగాయి. ఆలయ ప్రాంగణాల్లో ముఖ్య వీధులు, కూడళ్ల వద్ద మహిళలు బతుకమ్మ ఆటలతో సందడి చేశారు. మహాశక్తి ఆలయంలో జరిగిన వేడుకల్లో కేంద్ర మంత్రి బండి సంజయ్‌కుమార్‌, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే గంగుల నివాసంలో బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి. మార్క్‌ఫెడ్‌ గ్రౌండ్‌లో స్థానిక కార్పొరేటర్‌ ఎం రాజేందర్‌ ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో మంత్రి పొన్నం ప్రభాకర్‌, సుడా మాజీ చైర్మన కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌ పాల్గొన్నారు.

తీరొక్క పూలజాతర

- అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ సంబరాలు

- ఘనంగా బతుకమ్మల నిమజ్జనం

కరీంనగర్‌ కల్చరల్‌, అక్టోబరు 18 (ఆంధ్రజ్యోతి): సద్దుల బతుకమ్మ వేడుకలు జిల్లావ్యాప్తంగా ఆదివారం అంగరంగ వైభవంగా జరిగాయి. ఆలయ ప్రాంగణాల్లో ముఖ్య వీధులు, కూడళ్ల వద్ద మహిళలు బతుకమ్మ ఆటలతో సందడి చేశారు. మహాశక్తి ఆలయంలో జరిగిన వేడుకల్లో కేంద్ర మంత్రి బండి సంజయ్‌కుమార్‌, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే గంగుల నివాసంలో బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి. మార్క్‌ఫెడ్‌ గ్రౌండ్‌లో స్థానిక కార్పొరేటర్‌ ఎం రాజేందర్‌ ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో మంత్రి పొన్నం ప్రభాకర్‌, సుడా మాజీ చైర్మన కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌ పాల్గొన్నారు. తీగలగుట్టపల్లిలోని అయ్యప్ప దేవాలయం వద్ద జరిగిన వేడుకల్లో మేయర్‌ కొలగాని శ్రీనివాస్‌ దంపతులు పాల్గొన్నారు. భగతనగర్‌, రాంనగర్‌తో పాటు వివిధ డివిజన్లలో, వెల్ఫేర్‌, యూత క్లబ్‌ల ఆధ్వర్యంలో జరిగిన బతుకమ్మ వేడుకల్లో డిప్యూటీ మేయర్‌ సునీల్‌రావు పాల్గొన్నారు. మంత్రి పొన్నం నివాసం ఎదుట బతుకమ్మ వేడుకల్లో పొన్నం ప్రభాకర్‌, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ఎల్‌ఎండీ, ఎస్‌ఆర్‌ఎస్‌పీ కెనాల్‌, పద్మనగర్‌, చింతకుంట, హౌసింగ్‌బోర్డు కాలనీ, వేదభవన్‌, గౌతమీనగర్‌, సప్తగిరికాలనీ తదితర నిమజ్జన ప్రదేశాలు మహిళలతో కిటకిటలాడాయి.

Updated Date - Oct 19 , 2026 | 01:28 AM