Share News

ప్రశ్నించే గొంతుకుల ఓట్లను తొలగించే కుట్ర

ABN , Publish Date - Jun 29 , 2026 | 12:31 AM

ప్రశ్నించే గొంతుకల ఓట్లను తొలగించేందుకు బీజేపీ కుట్ర చేస్తోందని ప్రభుత్వ విప్‌, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్‌ అన్నారు.

ప్రశ్నించే గొంతుకుల ఓట్లను తొలగించే కుట్ర
సమావేశంలో మాట్లాడుతున్న ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌

ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌

చందుర్తి జూన్‌ 28 (ఆంధ్రజ్యోతి): ప్రశ్నించే గొంతుకల ఓట్లను తొలగించేందుకు బీజేపీ కుట్ర చేస్తోందని ప్రభుత్వ విప్‌, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్‌ అన్నారు. చందుర్తి మండల కేంద్రంలో ఏఐసీసీ, పీసీసీ పిలుపు మేరకు బూత్‌ లెవల్‌ ఏజెంట్ల(బీఎల్‌ఏల)కు ఆదివారం నిర్వ హించిన అవగాహన సమావేశానికి ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ ముఖ్యఅతిథిగా హాజరయ్యా రు. ఈ సందర్భంగా విప్‌ మాట్లాడుతూ, ఓటరు జాబితా సవరణ కార్యక్రమంలో బీఎల్‌ఏలు అప్రమత్తంగా ఉండి ప్రజలకు అవసరమైన సహకారం అందిం చాలని సూచించారు. ప్రతి ఓటరు తమ ఓటు ఉందో లేదో బీఎల్‌వోల వద్ద ఉన్న ఓటరు జాబితాలో తప్పనిసరిగా పరిశీలించుకోవాలని కోరారు. కాంగ్రెస్‌ పార్టీ సర్పంచులు, నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులు సామాజిక బాధ్యతగా గ్రామాల్లో ప్రజలకు ఓటరు జాబితాపై అవగాహ న కల్పించాలని తెలిపారు. ఎన్నికల సంఘం అనుమానాస్పద లేదా పరిశీలన జాబితాలో చేర్చిన ఓట్లకు సంబంధించి ఆయా ఓటర్లకు బీఎల్‌ఏలు సమాచారం అందించాలని అన్నారు. ఓటరు జాబితాలో ఏదైనా కారణంతో పేరు లేకపోతే, సంబంధిత దరఖాస్తు ఫారాన్ని నింపి గ్రామ, మండల, జిల్లాస్థాయి అధికారులకు సమర్పించేలా ప్రజలకు మార్గనిర్దేశం చేయాలని సూచించారు. ఎన్నికల్లో తిరిగినట్లుగా మళ్లీ బీఎల్‌ఏలు ఇంటిఇంటికి తిరిగి ఓట్ల సవరణలో ప్రజలకు సహాయ సహకారాలు అందించాలన్నారు. నియోజకవర్గ పరిధిలోని అనేక గ్రామాల్లో ఇప్పటికే 89 శాతానికి పైగా ఓటరు మ్యాపింగ్‌ పూర్తయిందన్నారు. ఇటీవల నియోజకవర్గ స్థాయిలో బీఎల్‌ఏలకు శిక్షణ శిబిరాలు కూడా నిర్వహించామన్నారు. ప్రశ్నించే గొంతులను అణచివేసేందుకు ఓట్లను తొలగించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. బెంగాల్‌, తమిళనాడు వంటి రాషా్ట్రల్లో బీజేపీకి నచ్చని వారి ఓట్లను లక్షల సంఖ్యలో తొలగించారన్నారు. తెలంగాణలో కూడా సుమారు 80 లక్షల ఓట్లను తొలగించే కుట్ర జరుగుతోందని ఆరోపించారు. ప్రజలు తమ ఓటు జాబితాలో ఉందోలేదో వెంటనే తనిఖీ చేసుకోవాలని, ఓటు హక్కును కాపాడుకోవాలని విప్‌ పిలుపునిచ్చారు.

అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు..

చందుర్తి మండల పరిధిలో అర్హులైన ప్రతీ ఒక్కరికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని విప్‌ తెలిపారు. ఇప్పటికే మొదటి విడతలో సుమారు 500 పైచిలుకు ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చామన్నారు. మండల పరిషత్‌ కార్యాలయంలో ప్రజాపాలన సమయంలో దరఖాస్తు చేసుకోలేని వారి కోసం నూతనంగా కౌంటర్లు ఏర్పాటు చేశామన్నారు. అర్హులైన వారు దరఖాస్తులు చేసుకోవాలని విప్‌ సూచించారు. కార్యక్రమంలో ఆత్మ కమిటీ చైర్మన్‌ ముస్కు ముకుంద రెడ్డి, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ చేలకల తిరుపతి, సర్పంచ్‌లు పులి సత్యం, బొజ్జ మల్లేశం, కట్కం మల్లేశం, కాంగ్రెస్‌ పార్టీ మండల అధ్యక్షుడు గొట్టే ప్రభాకర్‌, జిల్లా కాంగ్రెస్‌ పార్టీ కార్యదర్శి చింతపంటి రామస్వామి, మాజీ జడ్పీటీసీ నాగం కుమార్‌, నాయకులు పాల్గొన్నారు.

Updated Date - Jun 29 , 2026 | 12:31 AM