Share News

అలరించిన స్వర నీరాజనం

ABN , Publish Date - Aug 10 , 2026 | 12:37 AM

సంగీత లోకంలో విహరించేలా స్వర నిరాజనం అలరిం చింది.

అలరించిన స్వర నీరాజనం

సిరిసిల్ల, ఆగస్టు 9 (ఆంధ్రజ్యోతి) : సంగీత లోకంలో విహరించేలా స్వర నిరాజనం అలరిం చింది. ఆదివారం రాత్రి సిరిసిల్లలోని అనుశ్రీ బాంక్వెట్‌ హాల్‌ హాల్‌లో మ్యూజిక్‌ కంపోజర్‌ సాంబారి నవీన్‌ ఆధ్వర్యంలో గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, గాన కోకిల ఎస్‌ జాన కిలకు సంగీత నివాళి తెలుపుతూ స్వర నిరాజ నం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం, ఎస్‌ జానకి పాడిన విభిన్నమైన పాటలను రాజన్న సిరిసిల్ల జిల్లాలోని నలు మూలల నుంచి వచ్చిన గాయకులు పాడి విని పించారు. దాదాపు మూడు గంటలపాటు సాగి న స్వర నిరాజనం ప్రేక్షకులను అలరించింది. జానపద గాయకులు శిరీష, సంధ్యలతో పాటు పత్తిపాక రేవతి, నవ్య, షేక్‌ మస్తాన్‌, ఎర్రోజు నాగరాజు, మేఘ మయూరికా, టి ప్రణవి, నాం దేవ్‌, సదానందం ఇతరులు పాడిన పాటలు అలరించాయి. గాయకులను ఘనంగా సన్మానిం చారు. ఈ కార్యక్రమంలో మసీదు కమిటీ మాజీ అధ్యక్షులు ఎండి సలీం, సత్తార్‌, ప్రముఖ గాయ కులు సాంబారి నవీన్‌.జడల రమేష్‌ నాందేవ్‌, సాంబార్‌ రాజు, ప్రవీణ్‌, రామచంద్రం తదితరు లు పాల్గొన్నారు.

Updated Date - Aug 10 , 2026 | 12:37 AM