Share News

క్రీడలతో ఉజ్వల భవిష్యత్తు...

ABN , Publish Date - Sep 08 , 2026 | 12:27 AM

క్రీడలతో విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని కరీంనగర్‌ మేయర్‌ కొలగాని శ్రీనివాస్‌ అన్నారు. కరీంనగర్‌ పద్మనగర్‌లోని మానేరు పాఠశాలలో జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఎస్‌జీఎఫ్‌ అర్బన్‌ కబడ్డీ పోటీలను ఆయన ప్రారంభించారు.

క్రీడలతో ఉజ్వల భవిష్యత్తు...

కరీంనగర్‌ స్పోర్ట్స్‌, సెప్టెంబరు 7 (ఆంధ్రజ్యోతి): క్రీడలతో విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని కరీంనగర్‌ మేయర్‌ కొలగాని శ్రీనివాస్‌ అన్నారు. కరీంనగర్‌ పద్మనగర్‌లోని మానేరు పాఠశాలలో జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఎస్‌జీఎఫ్‌ అర్బన్‌ కబడ్డీ పోటీలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మేయర్‌ శ్రీనివాస్‌ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం క్రీడలకు పెద్దపీట వేస్తోందన్నారు. మానేరు విద్యాసంస్థల అధినేత కడారి అనంతరెడ్డి మాట్లాడుతూ ఎస్‌జీఎఫ్‌ కబడ్డీ పోటీలను వరుసగా రెండు సంవత్సరాలు నిర్వహించామన్నారు. ఒలింపిక్‌ సంఘం రాష్ట్ర సంయుక్త కార్యదర్శి గసిరెడ్డి జనార్దన్‌రెడ్డి మాట్లాడుతూ ఎస్‌జీఎఫ్‌ క్రీడల్లో జిల్లాను ముందంజలో నిలపాలని సూచించారు. ఎస్‌జీఎఫ్‌ అర్బన్‌ కార్యదర్శి అంతటి శంకరయ్య మాట్లాడుతూ కబడ్డీ పోటీలకు 1400 మంది క్రీడాకారులు హాజరైనట్లు తెలిపారు. కార్యక్రమంలో ఒలింపిక్‌ సంఘం ఉమ్మడి జిల్లా ఉపాధ్యక్షుడు తుమ్మల రమేశ్‌రెడ్డి, జిల్లా పాఠశాలల, కళాశాలల క్రీడా సమాఖ్య కార్యదర్శి బన్సిలాల్‌, కబడ్డీ సంఘం కార్యదర్శి జిల్లా మల్లేశ్‌గౌడ్‌, ఎస్‌జీఎఫ్‌ మాజీ కార్యదర్శి వేణుగోపాల్‌, పీపీఈటీఏ బాధ్యులు దారం గౌతమ్‌ రెడ్డి, కంకటి అనూప్‌కుమార్‌ పాల్గొన్నారు.

Updated Date - Sep 08 , 2026 | 12:27 AM