Share News

సంక్షేమం, అభివృద్ధికి పెద్దపీట

ABN , Publish Date - Mar 21 , 2026 | 01:40 AM

రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో సం క్షేమ పథకాల అమలు, అభివృద్ధి పనులకు పెద్దపీట వేశారు. శుక్రవారం మంత్రి శాసనసభలో 2026-27 సంవత్సరానికి గాను 3,24,234 రూపాయలతో బడ్జెట్‌ ప్రవేశపెట్టారు. బడ్జెట్‌పై ప్రతిపక్ష పార్టీ నాయకులు భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేస్తుండగా, అధికార కాంగ్రెస్‌ పార్టీకి చెందిన నాయకులు బడుగు బల హీన వర్గాల సంక్షేమానికి ఈ ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొంటున్నారు.

సంక్షేమం, అభివృద్ధికి పెద్దపీట

- ఆరు గ్యారెంటీ పథకాల కొనసాగింపు

- రాజీవ్‌ యువ వికాసం పథకంపై ఆశలు

- ఇంటర్‌ విద్యార్థులకు ఇక మధ్యాహ్న భోజనం

- యంగ్‌ ఇండియా ఇంటర్నేషనల్‌ స్కూల్స్‌కు నిధుల కేటాయింపు

- నిరుపేదలకు ఇందరమ్మ బీమా

- పంటల బీమా పథకానికి మోక్షం

(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి)

రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో సం క్షేమ పథకాల అమలు, అభివృద్ధి పనులకు పెద్దపీట వేశారు. శుక్రవారం మంత్రి శాసనసభలో 2026-27 సంవత్సరానికి గాను 3,24,234 రూపాయలతో బడ్జెట్‌ ప్రవేశపెట్టారు. బడ్జెట్‌పై ప్రతిపక్ష పార్టీ నాయకులు భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేస్తుండగా, అధికార కాంగ్రెస్‌ పార్టీకి చెందిన నాయకులు బడుగు బల హీన వర్గాల సంక్షేమానికి ఈ ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొంటున్నారు. అన్ని రంగాలను దృష్టిలో పెట్టుకొని రూపొందించారని చెబుతున్నారు. ఇప్పటి వరకు ప్రభుత్వం ప్రకటించిన ఆరు గ్యారెంటీ పథ కాల్లో భాగంగా కొన్ని పథకాలను అమలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ పథకాలకు కొసాగింపుగా బడ్జెట్‌లో సరిపడా నిధులను కేటాయించారు. అంతే కాకుండా ఈ యేడాది ప్రకటించిన రాజీవ్‌ యువ వికాసం పథకాన్ని అమల్లోకి తీసుకువస్తారా లేదా అనే విషయమై సందేహాలు నెలకొనగా, ఆ పథకం కోసం సుమారు 6000 కోట్ల నిధులను బడ్జెట్‌లో కేటా యించడంతో మళ్లీ ఆ పథకంపై ఆశలు చిగురిస్తు న్నాయి. అంతేకాకుండా ఎప్పటి నుంచో ప్రభుత్వం చెబుతున్నట్లుగా పంటల బీమా పథకాన్ని అమలు కోసం బడ్జెట్‌లో రూ.1,886 కోట్ల నిధులను కేటాయిం చడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అలాగే కళాశాలల్లో ఇంటర్‌ చదివే విద్యార్థుల సంఖ్యను పెంచేందుకు మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభిం చాలని వస్తున్న డిమాండ్‌ మేరకు వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి ఆ పథకాన్ని అమలు చేస్తామని, ఇందుకోసం నిధులు కూడా కేటాయించింది. అంతే గాకుండా వచ్చే జూన్‌ రెండవ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా లక్ష 15 వేల మందికి ఇందిరమ్మ బీమా పథకాన్ని అమలు చేసేందుకు నిధులను కేటాయిం చడం శుభ పరిణామంగా భావిస్తున్నారు. ఒక్కో వ్యక్తికి ఐదు లక్షల రూపాయల బీమా పథకాన్ని ప్రభుత్వం అమలు చేయాలని సంకల్పించింది. అయితే ఈ పథకాన్ని ఎంతవరకు అమలు చేస్తారో ననే అనుమనాలు నెలకొన్నాయి. అలాగే వచ్చే యేడాది జరగనున్న గోదావరి పుష్కరాల కోసం 500 కోట్ల నిధులను కేటాయించడంతో జిల్లాలో గోదావరి వెంట గల గోదావరిఖని, సుందిల్ల, మంథని తదితన ప్రాంతాల్లో పుష్కర ఘాట్లలో సౌకర్యాలు కల్పించేం దుకు అవకాశం లభించినట్లయింది. సమితి రంగానికి 22,615 కోట్ల రూపాయల నిధులను కేటాయించిన ప్రభుత్వం జిల్లా రైతన్న ఆశలు పెట్టుకున్న పత్తిపాక రిజర్వాయర్‌, పోతారం ఎత్తిపోతల పథకం, తదితర పథకాలకు నిధులు కేటాయించే అవకాశాలు లేకపో లేదు. ఎప్పటిలాగానే విద్య, వైద్యానికి కూడా సరిపడా నిధులు కేటాయించడం గమనార్హం. విద్యకు 26,676 కోట్లు, వైద్యానికి 13,679 కోట్లు కేటాయించింది. అంతే కాకుండా ఫ్రీ స్కూల్‌ నుంచి ఇంటర్‌ విద్యను అభ్య సించే వారి కోసం ఉదయం పూట అల్పాహార పథ కాన్ని ప్రారంభిస్తామని ప్రకటించింది.

Updated Date - Mar 21 , 2026 | 01:40 AM