Share News

అభివృద్ధి, సంక్షేమానికి పెద్దపీట

ABN , Publish Date - Jan 15 , 2026 | 12:11 AM

అభివృద్ధి, సంక్షే మానికి పెద్దపీట వేస్తూ ముందుకు సాగుతూ ప్రజల మన్ననలను పొందుతున్నామని స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌ శ్రీనివాస్‌ అన్నారు.

అభివృద్ధి, సంక్షేమానికి పెద్దపీట

వేములవాడ, జనవరి 14 (ఆంధ్రజ్యోతి): అభివృద్ధి, సంక్షే మానికి పెద్దపీట వేస్తూ ముందుకు సాగుతూ ప్రజల మన్ననలను పొందుతున్నామని స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌ శ్రీనివాస్‌ అన్నారు. ఎన్నికలో సమయాల్లో వచ్చి భావో ద్వేగాలను క్రియేట్‌ చేసి ఓట్లు కొల్లగొట్టాలని కొంత మంది చూస్తారని అన్నారు. పట్టణంలోని మహేలింగేశ్వర గార్డెన్‌ లో బుధవారం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్‌ మాట్లాడుతూ ప్రజలు కాంగ్రెస్‌ ప్రభుత్వంపై ఉన్న నమ్మకంతో ఓట్లు వేసి అధికారంలోకి తీసుకువచ్చారన్నారు. ప్రజల నమ్మకాలను ఎక్కడ వమ్ము చేయకుండా ముందుకు సాగుతున్నామన్నారు. ఆధ్మాత్మిక క్షేత్రమైన వేములవాడను టెంపుల్‌ సిటీగా అభివృద్ధి చేసేం దుకు ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళుతున్నామని తెలి పారు. ఇప్పటికే రాజన్న ఆలయ అభివృద్ధికి రూ.150 కోట్లు నిధులు మంజూరయ్యాయని, రూ.47కోట్లతో రోడ్డు విస్తరణ పనులు జరుగుతున్నాయని, పట్టణ సుందరీకరణలో భాగం గా రూ.2.65 కోట్లతో సెంట్రల్‌ లైటింగ్‌, డివైడర్‌ పనులు, రూ.4 కోట్లతో సీసీ రోడ్డు, డ్రైనేజీ పనులు, రూ.1.40 కోట్లతో గుడి చెరువులో బోటింగ్‌ ఏర్పాటు పనులు జరుగుతున్నా యని వివరించారు. కులమతాలకు అతీతంగా కాంగ్రెస్‌ ప్రభుత్వం నడుచుకుంటుందని దానికి నిదర్శనమే నియోజ కవర్గ స్థాయి ఎస్సీ, ఎస్టీ, బీసీ, క్రిస్టియన్‌ ఒక్కో భవనానికి రూ. 1.30 కోట్లు నిధులు మంజూరయ్యాయని, పట్టణంలో అసంపూర్తిగా ఉన్న షాదీఖాన కోసం రూ.80లక్షలు, మూల వాగులో వున్నగంగపుత్రుల గంగమ్మ ఆలయానికి వెళ్లేందు కు బ్రిడ్జి నిర్మాణానికి రూ.80లక్షలు ప్ర భుత్వం మంజూరు చేసిందని అన్నారు. రాబోవు ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీపైన ప్రజల సంపూర్ణి ఆశీస్సులు అందించాని కోరారు.పట్టణాభివృద్ధి చేసేందుకు మరిం త అవకాశం కల్పించాలన్నారు. కొన్ని పార్టీలు ఎన్నికల సమయంలో వచ్చిన ప్రజల్లో భావోద్వే గాలను నింపు ఓట్లను కొల్లగొట్టాలని చూస్తారన్నారు. వేముల వాడ మున్సిపల్‌ చైర్మన్‌ పీఠం బీఆర్‌ఎస్‌, బీజేపికి అవకాశం ఇచ్చారని, వారు ఎలాంటి అభివృద్ధి చేశారో ప్రజలు గమ నించారని, ఒక్కసారి కాంగ్రెస్‌ పార్టీకి అవకాశం కల్పించి అభివృద్దిని చూడండని కోరారు. ఈ సమావేశంలో మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ రొండి రాజు, వైస్‌ చైర్మన్‌ కనికరపు రాకేష్‌, సంద్రగిరి శ్రీనివాస్‌, బింగి మహేష్‌, సంఘ స్వామి యాదవ్‌, కూరగాయాల కొముర య్య, చిలుక రమేష్‌, సాగరం వెంకటస్వామి అక్రమ్‌ తదిత రులు ఉన్నారు.

Updated Date - Jan 15 , 2026 | 12:11 AM