Share News

మహిళా సంక్షేమానికి పెద్దపీట

ABN , Publish Date - Mar 08 , 2026 | 12:41 AM

మహిళా సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నది ప్రభుత్వ విప్‌, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్‌ అన్నారు.

మహిళా సంక్షేమానికి పెద్దపీట
మూడపల్లిలో మాట్లాడుతున్న ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌

ప్రభుత్వ విప్‌ అది శ్రీనివాస్‌

మహిళా సంఘ భవనాలకు భూమి పూజ

చందుర్తి, మార్చి 7 (ఆంధ్రజ్యోతి): మహిళా సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నది ప్రభుత్వ విప్‌, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్‌ అన్నారు. చందుర్తి మండలంలోని తిమ్మాపూర్‌, రామన్నపేట గ్రామాల్లో సీసీ రోడ్ల నిర్మాణానికి, సీఆర్‌ఆర్‌ ఎస్సీ సబ్‌ ప్లాన్‌ కింద రూ. 14 లక్షల వ్యయంతో నిర్మించనున్న పలు సీసీ రోడ్ల పనులకు, మూడపల్లి, కట్టలింగంపేట గ్రామాల్లో 20 లక్షలతో నిర్మిస్తున్న మహిళ సమైక్య భవనానికి ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ ముఖ్యఅతిథిగా హాజరై శంకుస్థాపన నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ మాట్లాడుతూ గ్రామాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో రహదారుల అభివృద్ధి ద్వారా ప్రజలకు రవాణా సౌకర్యాలు మెరుగుపడతాయని పేర్కొన్నారు. ఒక వైపు అభివృద్ధి, మరొక వైపు సంక్షేమమే తమ ప్రభుత్వ ధ్యేయం అన్నారు. కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వం వచ్చాక రాష్ట్రం అభివృద్ధిలో ముందుకు వెళ్తుందన్నారు. అన్నివర్గాల సంక్షేమం కాంగ్రెస్‌ పార్టీ ధ్యేయం అన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా 99 రోజుల ప్రణాళికతో ముందుకు వెళ్తున్నామన్నారు. మహిళలకు ఐక్యత చిహ్నంగా స్వశక్తి సంఘాలకు బలోపేతం చేస్తున్నట్లు తెలిపారు. ప్రజా ప్రభుత్వంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కోటి మంది మహిళల్ని కోటీశ్వరులను చేయడానికి ముందుకు వెళ్తున్నట్టు తెలిపారు. ఇప్పటి వరకు మహిళా సంఘాలకు 26 వేల కోట్లు బ్యాంక్‌ల ద్వారా వడ్డీలేని రుణాలు అందించామన్నారు. మహిళలను అన్నిరంగాల్లో అభివృద్ధి చేయడానికి రేవంత్‌ సర్కార్‌ కృషి చేస్తున్నట్లు తెలిపారు. నేతన్నలకు పనికల్పిస్తూ, మహిళల ఆత్మగౌరవం పెంచుతున్నామన్నారు. .చందుర్తి మండలాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో తీసుకెళ్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమాల్లో ఎంపీడీవో రాధ, ఏఎంసి చైర్మన్‌ చెలుకల తిరుపతి, సర్పంచ్‌లు చిలుక మల్లేశ్వరి-అంజిబాబు, కాపిల్ల స్వామి, పోతరాజు భారతి-నగేష్‌, ఆవారి రమేష్‌, మాజి జడ్పిటిసి సభ్యుడు నాగం కుమార్‌, మండల కాంగ్రెస్‌ అధ్యక్షుడు చింతపంటి రామస్వామి, ఉప సర్పంచ్‌లు, వార్డు సభ్యులు, మహిళ సంఘాల సభ్యులు, గామస్తులు, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Mar 08 , 2026 | 12:41 AM