Share News

జిల్లాలో 777 ఇందిరమ్మ ఇళ్లు పూర్తి

ABN , Publish Date - Mar 26 , 2026 | 12:24 AM

రాజన్న సిరిసిల్ల జిల్లాలో 777 ఇందిరమ్మ ఇళ్లు పూర్తయ్యాయని, వివిధ దశలో కొనసాగుతున్న నిర్మాణ పనులను వేగవంతం చేసి పండుగ వాతావరణంలో గృహా ప్రవేశాలకు సిద్ధం చేయాలని కలెక్టర్‌ గరిమ అగ్రవాల్‌ అన్నారు.

జిల్లాలో 777 ఇందిరమ్మ ఇళ్లు పూర్తి

ఎల్లారెడ్డిపేట, మార్చి 25 (ఆంధ్రజ్యోతి) : రాజన్న సిరిసిల్ల జిల్లాలో 777 ఇందిరమ్మ ఇళ్లు పూర్తయ్యాయని, వివిధ దశలో కొనసాగుతున్న నిర్మాణ పనులను వేగవంతం చేసి పండుగ వాతావరణంలో గృహా ప్రవేశాలకు సిద్ధం చేయాలని కలెక్టర్‌ గరిమ అగ్రవాల్‌ అన్నారు. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని నమూనా ఇందిరమ్మ ఇళ్లు, భవిత కేంద్రా న్ని బుధవారం ఆమె ప్రారంభించారు. మండల సమాఖ్య భవనం, ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో కొనసాగుతున్న మినీ స్టేడియం పనులను పరిశీలించారు. గుండారంలో ఇందిరమ్మ గృహ ప్రవేశాల కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ గరిమ అగ్రవాల్‌ మాట్లా డుతూ ఇళ్లు లేని నిరుపేదలకు రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేసి నిర్మాణానికి నాలుగు విడతల్లో రూ.5 లక్షల ఆర్థిక సహాయం అందిస్తోందని అన్నారు. ప్రభుత్వ నిర్ధేశిత ధరలోనే ఇళ్లను నిర్మించుకునేలా సంబంధిత శాఖ అధికారులు అవగాహన కల్పించాలని అన్నారు. లబ్ధిదారులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టాలని అన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ‘ప్రజా పాలన- ప్రగతి ప్రణాళిక’లో భాగంగా మార్చి 6 నుంచి జూన్‌ 12 వరకు అన్ని శాఖల ఆధ్వ ర్యంలో కార్యక్రమాలను చేపడుతున్నామని అన్నారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని అన్నారు. మండల కేంద్రంలో గృహ నిర్మాణ శాఖ ఆధ్వర్యంలో నిర్మించిన నమూనా ఇందిరమ్మ ఇళ్లలో ఉష్ణో గ్రత, స్లాబ్‌ నిర్మాణ వ్యయం తగ్గించేందుకు ఫిల్లర్‌ రూఫింగ్‌ విధానం బాగుందని ప్రశంసించారు. గుండారంలో లబ్ధిదారులతో ముచ్చటించారు. తమ స్వంతింటి కల సాకారమైందని పేర్కొన్నారు.

ప్రత్యేక అవసరాల పిల్లలకు అండగా భవిత కేంద్రం

ప్రత్యేక అవసరాల పిల్లలకు భవిత కేంద్రం అండగా నిలుస్తోందని కలెక్టర్‌ గరిమ అగ్రవాల్‌ అన్నారు. మండల కేంద్రంలో నిర్మించిన భవిత కేంద్రాన్ని బుధవారం ఆమె ప్రారంభించారు. కేంద్రం పరిధిలో ఎంత మంది దివ్యాంగులు ఉన్నారూ..? ఏయే సేవలు అందిస్తారని సంబంధిత శాఖ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ గరిమ అగ్రవాల్‌ మాట్లాడుతూ దివ్యాంగుల విద్యార్థులకు మెరుగైన సేవలు అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం భవిత కేంద్రాన్ని ఏర్పాటు చేసిందని అన్నారు. సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ప్రతి బుధ, గురువారాల్లో ఐఈఆర్పీ, ఫిజియోథెరపిస్ట్‌ అందుబాటులో ఉంటా రని అన్నారు. దివ్యాంగుల తల్లిదండ్రులు భవిత కేంద్రం ద్వారా తమ పిల్లలకు మెరుగైన సేవలు పొందాలని కలెక్టర్‌ గరిమ అగ్రవాల్‌ అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాధికారి జగన్మోహన్‌రెడ్డి, గృహా నిర్మాణ శాఖ పీడీ వెంకటమాధవరావు, డీఈ సాజిద్‌, మండల ప్రత్యేక అధికారి అఫ్జల్‌బేగం, తహసీల్దార్‌ సుజాత, ఎంపీడీవో సత్తయ్య, ఎంఈవో కృష్ణహరి, ఏఎంసీ చైర్‌పర్సన్‌ సబేరాబేగం, ఎంపీవో రాజు, మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడు నర్సయ్య, సర్పంచులు నర్సయ్య, సరోజ, ఆయా గ్రామాల ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Mar 26 , 2026 | 12:24 AM