Share News

తొలిరోజు 36 నామినేషన్లు

ABN , Publish Date - Jan 29 , 2026 | 12:36 AM

సిరిసిల్ల మున్సి పల్‌ ఎన్నికల ప్రక్రియలో నామినేషన్ల పర్వం మొదలైంది.

తొలిరోజు 36 నామినేషన్లు

సిరిసిల్ల, జనవరి 28 (ఆంధ్రజ్యోతి): సిరిసిల్ల మున్సి పల్‌ ఎన్నికల ప్రక్రియలో నామినేషన్ల పర్వం మొదలైంది. బుధవారం అధికారులు నోటిఫికేషన్‌ జారీ చేసి నామి నేషన్లను స్వీకరించారు. నామినేషన్ల స్వీకరణకు 13 కౌంట ర్లను ఏర్పాటు చేశారు. తొలిరోజు 20నామినేషన్లు దాఖలు అయ్యాయి. ఇందులో బీఆర్‌ఎస్‌ 11, బీజేపీ 5, కాంగ్రెస్‌ నుంచి 4 నామినేషన్లు వేశారు. నామినేషన్లు వేసిన వారి లో 2వ వార్డు నుంచి బత్తుల కవిత, 3వ వార్డు నుంచి జిందం కళ, 9వ వార్డులో టెకు సంధ్య, 11వ వార్డు నుంచి ఒగ్గు రాజేశం, మామిడాల మహేష్‌, 12వ వార్డు నుంచి సూర నిర్మల, మొగిలి సుధాకర్‌, 13వ వార్డు బోగ వేంక టేశం, 16వ వార్డు నుంచి గుడ్ల శ్రీనివాస్‌, 18వ వార్డు నుంచి గడ్డం చందన, 19వ వార్డు నుంచి అన్నారపు శ్రీనివాస్‌, 20వ వార్డు నుంచి ఆడెపు మహేందర్‌, 29వ వార్డు నుంచి గెం ట్యాల శ్యామల, 30వ వార్డు నుంచి మంచె రేణుక,నాగుల రూప, 32వ వార్డు నుంచి కూరపాటి శ్రీశైలం, 33వ వార్డు నుంచి కొండ వర్షిణి, 34 దార్ల సందీప్‌, 36వ వార్డు నుంచి కల్లూరి రేణుక, 38వ వార్డు నుంచి రిక్కుమల్లె రజితలు నామినేషన్‌ వేశారు.

కేంద్రాలను పరిశీలించిన అదనపు కలెక్టర్‌

సిరిసిల్ల మున్సిపాలిటీలో ఏర్పాటుచేసిన నామినేషన్‌ కేంద్రాల ను అదనపు కలెక్టర్‌ గడ్డం నగేష్‌ బుధవారం పరిశీలించారు. నామినేషన్‌ కేంద్రాల్లో చేసిన ఏర్పాట్లను పరిశీలించి, అధికారు లకు పలు సూచనలు చేశారు.అయన వెంట మున్సిపల్‌ కమిష నర్‌ ఖదీర్‌ పాషా తదితరులు ఉన్నారు.

Updated Date - Jan 29 , 2026 | 12:36 AM