Share News

బరిలో 283 మంది..

ABN , Publish Date - Feb 04 , 2026 | 01:57 AM

బల్దియా ఎన్నికల్లో అభ్యర్థుల లెక్క తేలింది. కొట్లాటకు సై అంటూ ప్రచారం వైపు పరుగులు మొదలుపెట్టారు.

బరిలో 283 మంది..

(ఆంధ్రజ్యోతి, సిరిసిల్ల)

బల్దియా ఎన్నికల్లో అభ్యర్థుల లెక్క తేలింది. కొట్లాటకు సై అంటూ ప్రచారం వైపు పరుగులు మొదలుపెట్టారు. మంగళవారం సిరిసిల్ల, వేము లవాడ మున్సిపాలిటీలో నామినేషన్ల ఉపసంహరణ ఉత్కంఠగా సాగింది. మధ్యాహ్నం మూడు గంటల వరకు ప్రధాన పార్టీల్లో టికెట్లు ఆశిస్తూ నామినేషన్లు వేసిన వారికి బీ- ఫాం లభించగా తిరుగుబాటుకు తెరలేపిన అభ్యర్థులను పోటీ నుంచి ఉపసంహరించుకునే విధంగా తంటాలు పడ్డారు. ప్రధానంగా పార్టీల్లో నెలకొన్న సమస్యను అధిగమించడంలో సఫలీకృతమయ్యారు. సిరిసిల్ల, వేములవాడ మున్సిపాలిటీలో నామినేషన్ల పర్వం ముగిసేనాటికి 67 వార్డుల్లో 384 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. ఇందులో సిరిసిల్లలో 234 మంది, వేములవాడలో 150 మంది నామినేషన్లు వేశారు. కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌, బీజేపీ పార్టీల నుంచి టికెట్లు ఆశిస్తూ పార్టీ పెద్దల చుట్టూ చక్కర్లు కొట్టారు. చివరకు బీ-ఫాంలో దక్కక నిరాశ పడ్డారు. పార్టీ పెద్దల సంప్రదింపులు, బుజ్జగింపులతో రెండు మున్సిపాలిటీల్లో 101 మంది అభ్యర్థులు ఉపసంహరించుకున్నారు. ఇందులో సిరిసిల్లలో 64 మంది, వేములవాడలో 37 మంది ఉన్నారు. రెండు మున్సిపాలిటీలో 283 మంది అభ్యర్థులు పోటీలో మిగిలారు. వీరిలో సిరిసిల్లలో 170 మంది,వేములవాడలో 113మంది పోటీలో ఉన్నారు. ఉపసంహరణల ప్రక్రియను ఎన్నికల పరిశీలకుడు శ్రీనివాస్‌రెడ్డి, ఆర్డీవో వెంకటేశ్వర్లు పరిశీలించారు. బీఆర్‌ఎస్‌ అభ్యర్థుల బీ పాంలను ఇన్‌చార్జి మాజీ జడ్పీ చైర్‌పర్సన్‌ తుల ఉమ, కాంగ్రెస్‌ అభ్యర్థుల బీ పాంలను జిల్లా అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్‌లు అధికారులకు అందించారు.

సిరిసిల్ల మున్సిపాలిటీ పరిధిలో 39 వార్డులు ఉండగా, 234 మంది నామినేషన్‌ వేశారు. ఉపసంహరణ చివరి గడువు వరకు అభ్యర్థులు తమ నామినేషన్‌ ఉపసంహరించుకోవడంలో రసవత్తరమైన సంఘటనలు చోటుచేసుకున్నాయి. ప్రధాన పార్టీల్లో టికెట్‌ ఆశిస్తూ నామినేషన్లు వేసిన వారు ఉపసంహరించుకోవడానికి ఇబ్బంది పెట్టారు. సిరిసిల్లలో చివరకు 64మంది అభ్యర్థులు ఉపసంహరించుకున్నారు. నామినేషన్లు వేసి ఉప సంహరించుకున్న వారిలో బీజేపీ నుంచి ఏడు మంది, కాంగ్రెస్‌ నుంచి 16 మంది, బీఆర్‌ఎస్‌ నుంచి 32మంది, ఫార్వర్డ్‌ బ్లాక్‌ నుంచి ఒకరు, స్వతం త్రులు ఎనిమిది మంది అభ్యర్థులు నామినేషన్లు సంహరించుకున్నారు. పోటీలు 170 మనది అభ్యర్థులు మిగిలారు ఉన్నారు.

సిరిసిల్ల 1వ వార్డులో బీఆర్‌ఎస్‌ బూర బాలమల్లు, కాంగ్రెస్‌ ఎలుక తిరుపతి, బీజేపీ బూర విష్ణు, 2వ వార్డులో బీఆర్‌ఎస్‌ వేముల రాములు, కాంగ్రెస్‌ డాక్టర్‌ కవిత, బీజేపీ దుమాల శ్రీకాంత్‌, 3వ వార్డులో బీఆర్‌ఎస్‌ జిందం కళ, కాంగ్రెస్‌ కాముని వనిత, బీజేపీ చొప్పదండి స్వరూప రాణి, 4వ వార్డులో అడ్డగట్ల మాధవి, కాంగ్రెస్‌ లైక్యు సుల్తానా, బీజేపీ మహేషుని స్రవంతి, 5వ వార్డులో బీఆర్‌ఎస్‌ దార్నం అరుణ, కాంగ్రెస్‌ యెల్లే హేమలత, బీజేపీ దూడం ఉషశ్రీ, 6వ వార్డులో బీఆర్‌ఎస్‌ దూడం రజని, కాంగ్రెస్‌ నల్ల ఉమ, బీజేపీ ఇంజపూరి నవ్య, 7వ వార్డులో బీఆర్‌ ఎస్‌ అగ్గి రాములు, కాంగ్రెస్‌ వేముల రవి, బీజేపీ ఎర్రం వెంకట్రాజం, 8వ వార్డులో బీఆర్‌ఎస్‌ లింగంపల్లి భాగ్యలక్ష్మి, కాంగ్రెస్‌ బడుగు జయశ్రీ, బీజేపీ జంగిటి పుష్ప, 9వ వార్డులో బీఆర్‌ఎస్‌ దొంతనేని కళ్యాణి, కాంగ్రెస్‌ చెన్నమనేని కీర్తి, బీజేపీ టేకు సంధ్య, 10వ వార్డులో బీఆర్‌ఎస్‌ నాగుల కావ్య, కాంగ్రెస్‌ చల్ల పద్మ, బీజేపీ మంజుల, 11వ వార్డులో బీఆర్‌ఎస్‌ ఒగ్గు రాజేశం, కాంగ్రెస్‌ బీమనాథిని రవీందర్‌, బీజేపీ మామిడాల మహేష్‌, 12వ వార్డులో బీఆర్‌ఎస్‌ మొగిలి నాగరాజు, కాంగ్రెస్‌ సూర నిర్మల, బీజేపీ మోగిలి సుధాకర్‌, 13వ వార్డులో బీఆర్‌ఎస్‌ బుర్ర నారాయణ, కాంగ్రెస్‌ బోగ వేంకటేశం, బీజేపీ వోడ్నాల శంకర్‌, 14వ వార్డులో బీఆర్‌ఎస్‌ అడ్డగట్ల మాదవి, కాంగ్రెస్‌ వెంగల లీల, బీజేపీ పోకల భవాని, 15వ వార్డులో బీఆర్‌ఎస్‌ కూర భాగ్యలక్ష్మీ, కాంగ్రెస్‌ ఆకునూరి దీపిక, బీజేపీ వడ్లూరి మమత, 16వ వార్డులో బీఆర్‌ఎస్‌ గుండ్ల శ్రీనివాస్‌, కాంగ్రెస్‌ గుజ్జె తార, బీజేపీ గజ్జెల జగన్‌, 17వ వార్డులో బీఆర్‌ఎస్‌ గుడ్లపెల్లి నీరజ, కాంగ్రెస్‌ రాపెల్లి కళ్యాణ్‌, బీజేపీ మ్యాన రాంప్రసాద్‌, 18వ వార్డులో బీఆర్‌ఎస్‌ గుండ్లపెల్లి లత, కాంగ్రెస్‌ గెట్యాల రేణుక, బీజేపీ మెర్గు మంజుల, 19వ వార్డులో బీఆర్‌ఎస్‌ అన్నారం శ్రీనివాస్‌, కాంగ్రెస్‌ బొద్దుల శ్రీనివాస్‌, బీజేపీ నంది తిరుమల, 20వ వార్డులో బీఆర్‌ఎస్‌ సాగాల హరిప్రసాద్‌, కాంగ్రెస్‌ ఇప్పపూల లక్ష్మణ్‌, బీజేపీ కొట్టె భానుకుమార్‌, 21వ వార్డులో బీఆర్‌ఎస్‌ ఎలుక వేంకటేశం, కాంగ్రెస్‌ స్వర్గం సాగర్‌, బీజేపీ గాలి శ్రీనివాస్‌, 22వ వార్డులో బీఆర్‌ఎస్‌ కత్తెర వరుణ్‌, కాంగ్రెస్‌ లింగంపల్లి గంగరాజు, బీజేపీ ఎం భాస్కర్‌, 23వ వార్డులో బీఆర్‌ఎస్‌ కల్లూరి లత, కాంగ్రెస్‌ ఆడేపు చంద్రకళ, బీజేపీ అన్నల్‌దాస్‌ లలిత, 24వ వార్డులో బీఆర్‌ఎస్‌ బుర్ర మల్లిఖార్జున్‌, కాంగ్రెస్‌ ఆడేపు వేంకట స్వామి, బీజేపీ గుంటుక మంజుల, 25వ వార్డులో బీఆర్‌ఎస్‌ బింగి రామంజనే యలు, కాంగ్రెస్‌ కుడిక్యాల రవి, బీజేపీ భారత్‌ మహేష్‌, 26వ వార్డులో బీ ఆర్‌ఎస్‌ నేల్లుట్ల నరేష్‌, కాంగ్రెస్‌ చిప్ప పెంటయ్య, బీజేపీ గుంటుక కోటే శ్వర్‌, 27వ వార్డులో బీఆర్‌ఎస్‌ కాసర్ల పద్మ, కాంగ్రెస్‌ అంజుంఅరా బేగం, బీజేపీ సంగీతం లత, 28వ వార్డులో బీఆర్‌ఎస్‌ అడిశేర్ల రూప, కాంగ్రెస్‌ మాసం లక్ష్మీ, బీజేపీ చేపూరి కృష్ణకుమారి, 29వ వార్డులో బీఆర్‌ఎస్‌ గెట్యాల శ్మామల, కాంగ్రెస్‌ బూట్ల లత, బీజేపీ పల్లికొండ సత్యమ్మ, 30వ వార్డులో బీఆర్‌ఎస్‌ మంచె రేణుక, కాంగ్రెస్‌ దూంపెటి లాస్య, బీజేపీ కర్నె హరీష, 31వ వార్డులో బీఆర్‌ఎస్‌ పాశికంటి రమ్య, కాంగ్రెస్‌ బూర్ల సరోజన, బీజేపీ రేగుల రేణుక, 32వ వార్డులో బీఆర్‌ఎస్‌ సయ్యద్‌ అక్రమ్‌, కాంగ్రెస్‌ కూరపా టి శ్రీశైలం, బీజేపీ అడ్డగట్ల ప్రవీణ్‌, 33వ వార్డులో బీఆర్‌ఎస్‌ దార అశోక్‌, కాంగ్రెస్‌ స్వర్గం రాజు, బీజేపీ కొండ వర్షిణి, 34వ వార్డులో బీఆర్‌ఎస్‌ దార్ల సందీప్‌, కాంగ్రెస్‌ మార్గం మంజుల, బీజేపీ మారుపాక శ్రీధర్‌, 35వ వార్డు లో బీఆర్‌ఎస్‌ బత్తుల రమేష్‌, కాంగ్రెస్‌ దుబాల వేంకటేశం, బీజేపీ సురం వినయ్‌, 36వ వార్డులో బీఆర్‌ఎస్‌ కల్లూరి రేణుక, కాంగ్రెస్‌ జే మమత, బీ జేపీ బీ శోభ, 37వ వార్డులో బీఆర్‌ఎస్‌ దిడ్డి మాధవి, కాంగ్రెస్‌ సామల రోజా, బీజేపీ ఊరగొండ లక్ష్మీ, 38వ వార్డులో బీఆర్‌ఎస్‌ రిక్కుమల్ల రజిత, కాంగ్రెస్‌ గోరంటాల లలిత, బీజేపీ మోర శైలజ, 39వ వార్డులో బీఆర్‌ఎస్‌ ఆకుల స్వప్న, కాంగ్రెస్‌ చిటికెన విజయ, బీజేపీ వోడ్నాల స్వరూప ఉన్నారు.

వేములవాడలో 113 అభ్యర్థులు..

వేములవాడ, ఫిబ్రవరి 3 (ఆంధ్రజ్యోతి): వేములవాడ మున్సిపల్‌ ఎన్నిక ల్లో భాగంగా ఆయా పార్టీలు కౌన్సిలర్‌ అభ్యర్థుల జాబితాను విడుదల చేశా రు. కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థుల జాబితాను ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌, బీజే పీ అభ్యర్థుల జాబితాను చల్మెడ లక్ష్మీనర్సింహారావు, బీజేపీ అభ్యర్థులను మాజీ జిల్లా అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ మంగళవారం తమ పార్టీ బీ- ఫామ్‌లను ఎన్నికల రిటర్నింగ్‌ అధికారులకు సమర్పించారు. వేములవాడ మున్సిపల్‌ ఎన్నికల్లో భాగంగా 28వార్డులకు మొత్తం 150మంది నామినేష న్లు దాఖలు చేయగా మంగళవారం ఉపసంహరణల గడువు ముగిసేసరికి 37 మంది వ్యక్తులు తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. మున్సి పల్‌ ఎన్నికల్లో 113మంది అభ్యర్థులు 28వార్డుల్లో ఆయా పార్టీల నుంచి బరిలో నిలుస్తున్నట్లు మున్సిపల్‌ కమిషనర్‌ సంపత్‌కుమార్‌ వెల్లడించారు.

ప్రధాన పార్టీల అభ్యర్థులు వీరే...

వేములవాడ మున్సిపల్‌ 28 వార్డుల్లో ఆయా పార్టీల నాయకులు తమ అభ్యర్థుల బీ-ఫామ్‌లను ఎన్నికల రిటర్నింగ్‌ అధికారులకు అందజేశారు. వార్డుల వారీగా ఆయా పార్టీల అభ్యర్థుల జాబితా ఇలా ఉంది.. 1వ వార్డు లో కాంగ్రెస్‌ అభ్యర్థి సంఘ హనుమవ్వ, బీజేపీ మ్యాకల రేణుక, బీఆర్‌ఎస్‌ రేగుల లత, 2వ వార్డులో కాంగ్రెస్‌ లింగంపల్లి జ్యోతి, బీజేపీ గుడిసే లక్ష్మి, బీఆర్‌ఎస్‌ ఏనుగు జ్యోతి, 3వ వార్డులో కాంగ్రెస్‌ గుడిసే సంతోష, బీజేపీ చిట్యాల లక్ష్మి, బీఆర్‌ఎస్‌ ఉల్లెందుల లక్ష్మి, 4వ వార్డు కాంగ్రెస్‌ తోట రాజు, బీజేపీ రేగుల రాజ్‌కుమార్‌, బీఆర్‌ఎస్‌ మారం కుమార్‌, సీపీఐ కడారి రాములు, 5వ వార్డు కాంగ్రెస్‌ బొజ్జ భారతి, బీజేపీ లాల శ్రీలత, బీఆర్‌ఎస్‌ వాసాల లావణ్య, 6వ వార్డు కాంగ్రెస్‌ కాశ శ్రీనివాస్‌, బీజేపీ పల్లపు లక్ష్మణ్‌, బీఆర్‌ఎస్‌ నీలం శేఖర్‌, 7వ వార్డు కాంగ్రెస్‌ అక్కనపల్లి నరేష్‌, బీజేపీ శామ ల శివాణి, బీఆర్‌ఎస్‌ సుంకపాక రాజు బీఎస్పీ కొల్లూరి రాజు, 8వ వార్డు కాంగ్రెస్‌ సాగరం వెంకటస్వామి, బీజేపీ మైలారం శ్రీనివాస్‌, బీఆర్‌ఎస్‌ క్రాం తి కుమార్‌, 9వ వార్డు కాంగ్రెస్‌ నీలం మమత, బీజేపీ సాతాని అనుష, బీఆర్‌ఎస్‌ రామతీర్థపు మాధవి, 10వ వార్డులో కాంగ్రెస్‌ సిరిగిరి సంగీత, బీజేపీ మంగ్యారి స్వప్న, బీఆర్‌ఎస్‌ మొట్టల అనుష, 11వ వార్డులో కాంగ్రెస్‌ సరిపల్లి అర్చన, బీజేపీ ద్వారక శ్రీదేవి, బీఆర్‌ఎస్‌ వెంగళ అనిత, 12వ వార్డు లో కాంగ్రెస్‌ రామతీర్థపు కృష్ణవేణి, బీజేపీ సార్ల చారీ, బీఆర్‌ఎస్‌ నిమ్మశెట్టి విజయ్‌, 13వ వార్డులో కాంగ్రెస్‌ మూడపల్లి నీలమ్మ, బీజేపీ ఈరెల్లి శ్రీలత, బీఆర్‌ఎస్‌ లింగంపల్లి మమత, 14వ వార్డులో కాంగ్రెస్‌ తూమ్‌ మధు, బీజే పీ లక్కారపు శ్రీనివాస్‌, బీఆర్‌ఎస్‌ నిమ్మశెట్టి రాజు, ఏఐఎఫ్‌బీ తుమ్మల దిలీప్‌, సీపీఐ తోట కనకయ్య, 15వ వార్డులో పుల్కం రాజు, బీజేపీ ముదం శంకరయ్య, బీఆర్‌ఎస్‌ గోస్కుల నర్సయ్య, 16వ వార్డులో కాంగ్రెస్‌ కూరగా యాల శ్రీశైలం, బీజేపీ వంగల శ్రీనివాస్‌, బీఆర్‌ఎస్‌ కొండ కనుకయ్య, 17వ వార్డులో కాంగ్రెస్‌ అక్కి గణేష్‌, బీజేపీ కొండ్లెపు చిన్న ముత్యం, బీఆర్‌ఎస్‌ పబ్బ మహేష్‌, 18వ వార్డులో కాంగ్రెస్‌ కొండ రాజశేఖర్‌, బీజేపీ కాసారపు అభిషేక్‌, బీఆర్‌ఎస్‌ కొండ నర్సయ్య, 19వ వార్డులో కాంగ్రెస్‌ సూగూరు లక్ష్మి, బీజేపీ రేగుల రాధిక, బీఆర్‌ఎస్‌ జంగిటి శ్రీనిధి, సీపీఐ గాజుల సుజాత, 20వ వార్డులో కాంగ్రెస్‌ పెంట స్వరూన్‌, బీజేపీ కుమ్మరి శంకర్‌, బీఆర్‌ఎస్‌ సందుల మహేశ్వరి, 21వ వార్డులో కాంగ్రెస్‌ కోయల్కర్‌ మస్తాన్‌, బీజేపీ మహంకాలి శ్రీనివాస్‌, బీఆర్‌ఎస్‌ నరాల శేఖర్‌, 22వ వార్డులో కాంగ్రెస్‌ ఇప్పపూల మమత, బీజేపీ బాచు శిరీష, బీఆర్‌ఎస్‌ లైశెట్టి లావణ్య, 23వ వార్డులో కాంగ్రెస్‌ నామాల ఉమ, బీజేపీ బోనాల సాగరిక, బీఆర్‌ఎస్‌ మో తుక జమున, 24వ వార్డులో కాంగ్రెస్‌ అన్నారం శ్రీనివాస్‌, బీజేపీ రాపెల్లి శ్రీధర్‌, బీఆర్‌ఎస్‌ నామాల కమలాకర్‌, 25వ వార్డులో కాంగ్రెస్‌ కొక్కుల బాలకృష్ణయ్య, బీజేపీ బిల్ల కృష్ణహరి, బీఆర్‌ఎస్‌ గూడూరి మధన్‌గోపాల్‌, 26వ వార్డులో కాంగ్రెస్‌ సిర్రం శిరీషయాదవ్‌, బీజేపీ మామిండ్ల అమర్ష, బీఆర్‌ఎస్‌ మామిండ్ల జమున, 27వ వార్డులో కాంగ్రెస్‌ బుట్టి లావణ్య, బీజే పీ రేగుల రేణుక, బీఆర్‌ఎస్‌ పెద్ది లలిత, 28వ వార్డులో కాంగ్రెస్‌ గోపన్న గారి మాధవిలత, బీజేపీ ప్రతాప హిమబిందు, బీఆర్‌ఎస్‌ పైడి స్వప్నలను ప్రకటిస్తూ జాబితాను విడుదల చేశారు.

Updated Date - Feb 04 , 2026 | 01:57 AM