పోక్సో, హత్య కేసులో 20 సంవత్సరాల జైలు, జీవిత ఖైదు
ABN , Publish Date - Jun 18 , 2026 | 12:17 AM
పోక్సో, హత్య కేసుల్లో నిందితుడికి 20 సంవత్సరాల జైలు శిక్షతోపాటు జీవిత ఖైదు విధిస్తూ పోక్సో కోర్టు తీర్పు ఇచ్చినట్లు ఎస్పీ మహేష్ బీగీతే ప్రకటించారు. సిరిసిల్ల జిల్లా పోలీస్ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన సమావేశంలో
సిరిసిల్ల అర్బన్, జూన్ 17 (ఆంధ్రజ్యోతి) పోక్సో, హత్య కేసుల్లో నిందితుడికి 20 సంవత్సరాల జైలు శిక్షతోపాటు జీవిత ఖైదు విధిస్తూ పోక్సో కోర్టు తీర్పు ఇచ్చినట్లు ఎస్పీ మహేష్ బీగీతే ప్రకటించారు. సిరిసిల్ల జిల్లా పోలీస్ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన సమావేశంలో జిల్లా ఎస్పీ మాటా ్లడారు. చందుర్తి , వేములవాడ పట్టణంలోని పోలీస్ స్టేషన్‌లలో రెండు కేసుల్లో మైనర్ బాలికపై లైంగిన వేధింపులకు పాల్పడిన పోక్సో కేసుతో పాటు ఆ బాలిక హత్య కేసులో నిందితుడికి పోక్సో కేసులో 20 సంవత్సరాలు జైలు, హత్య కేసులో జీవిత ఖైదు విధిస్తూ సిరిసిల్ల పోక్సో కోర్టు ప్రధాన న్యాయమూర్తి రాధికా జైస్వాల్ తీర్పు ఇచ్చినట్లు ఎస్పా వెల్లడించా రు. కొడిమ్యాల మండలం శ్రీరాములపల్లి గ్రామానికి చెందిన బండ పల్లి నవీన్ చందుర్తి మండలం మూఢపల్లి గ్రామా నికి చెందిన మైనర్ బాలికను లైంగిక వేధింపులకి గురిచేయగా బాధితురాలి తండ్రి ఫిర్యాదు మేరకు చందుర్తి పోలీస్‌స్టేషన్లో కేసు నమోదు చేసి అప్పటి వేములవాడ డీఎస్పీ వెంకటరమణ నిందితుడిని రిమాండ్‌కి తరలించి కోర్టులో చార్జిషీట్ దాఖలు చేసినట్లు తెలిపారు. అదే మైనర్ బాలికను హత్య చేయడంతో వేములవాడ పట్టణ పోలీస్‌స్టేషన్‌లో నమోదైన హత్య కేసులో బాధితురాలి తండ్రి ఫిర్యా దు మేరకు అప్పటి వేములవాడటౌన్ సీఐ వెంకటేష్ బండపల్లి నవీన్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు అనంతరం నిందితుడి రిమాండ్ చేసి కోర్టులో చార్జ్ షీట్‌లను దాఖలు చేసినట్లు తెలిపారు. విచారణలో భాగంగా జిల్లా అదనపు ఎస్పీ చంద్రయ్య పర్యవే క్షణలో కోర్టు మానిటరింగ్ ఎస్.ఐ రవీందర్ నాయుడు ఆధ్వర్యంలో చందుర్తి,వేములవాడ కోర్టు కానిస్టేబుల్స్ లతీఫ్, మహేందర్ , కోర్టు మానిటరింగ్ కానిస్టేబుల్ నవీన్, పొక్సో కోర్టు కానిస్టేబుల్ వెన్నెల కోర్టులో 15 మంది సాక్షులను ప్రవేశపెట్టగా ప్రాసి క్యూషన్ తరుపున పబ్లిక్ ప్రాసిక్యూటర్ పెంట శ్రీనివాస్ వాదించగా, శాస్త్రీయ ఆధారాలు, సాక్ష్యాలను పరిశీలించిన పోక్సో జిల్లా న్యాయమూర్తి నిందితుడైన బండపల్లి నవీన్‌కి పొక్సో కేసులో 20 సంవత్సరాలు జైలు శిక్ష, రూ.7వేల జరిమానా విధించారు. హత్య కేసులో జీవిత ఖైదు రూ. 5వేల జరిమానా విధించా రని ఎస్పీ తెలిపారు. నిందితుడికి శిక్షపడేలా చేసిన పోలీసులను ఎస్పీ అభినందిచారు.