Share News

108 సేవలను సద్వినియోగం చేసుకోవాలి

ABN , Publish Date - Feb 10 , 2026 | 11:58 PM

అత్యవసర సరిస్థితులలో జిల్లా లోని 108 సేవలను ప్రజలు సద్వినియోగం సద్వినియోగం చేసుకోవాలని ఇన్‌ చార్జి కలెక్టర్‌ గరిమ అగ్రవాల్‌ అన్నారు.

108 సేవలను సద్వినియోగం చేసుకోవాలి

సిరిసిల్ల టౌన్‌, ఫిబ్రవరి 10 (ఆంధ్రజ్యోతి) : అత్యవసర సరిస్థితులలో జిల్లా లోని 108 సేవలను ప్రజలు సద్వినియోగం సద్వినియోగం చేసుకోవాలని ఇన్‌ చార్జి కలెక్టర్‌ గరిమ అగ్రవాల్‌ అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని 108 అత్యవసర అంబులెన్స్‌ బేసిక్‌ లైఫ్‌ సపోర్ట్‌ వాహనం స్థానంలో అడ్వాన్స్‌ లైఫ్‌ సపోర్ట్‌ వాహనం రాగా, ఇన్‌చార్జి కలెక్టర్‌ గరిమ అగ్రవాల్‌ పరిశీలించారు. వాహ నంలోని ట్రాన్స్‌పోర్ట్‌ వెంటిలేటర్‌ విత్‌ డీఫిబ్రీలేటర్‌, మనిటర్‌ తదితర అత్య వసర సమయంలో ఉపయోగించే పరికరాల పనితీరును పరిశీలించారు. ఈ సందర్భంగా ఇన్‌చార్జి కలెక్టర్‌ మాట్లాడుతూ అత్యవసర సమాచారం అందు కున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవ లను అందిస్తూ దగ్గరలోని ప్రభుత్వ ఆసుపత్రికి చేర్చాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్‌ రజిత, ప్రోగ్రామ్‌ ఆఫీ సర్‌ డాక్టర్‌ నయిమా జహ, 108 ఉమ్మడి కరీంనగనర్‌ జిల్లా ప్రోగ్రాం మేనేజర్‌ భూమా నాగేందర్‌, జిల్లా మేనేజర్‌ అరుణ్‌కుమార్‌, సిబ్బంది పెద్ది శ్రీనివాస్‌, వడ్నాల అనిల్‌కుమార్‌, పోచంపల్లి పర్శరాములు పాల్గొన్నారు.

Updated Date - Feb 10 , 2026 | 11:58 PM