కంగనా.. ఆ చెంపదెబ్బ మరిచావా?
ABN , Publish Date - Jul 30 , 2026 | 07:38 AM
బీజేపీ ఎంపీ కంగనా రనౌత్‌పై మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ బుధవారం ఓ ప్రకటనలో తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
జెన్‌జీ మహిళలకు వెంటనే క్షమాపణ చెప్పు
మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి): బీజేపీ ఎంపీ కంగనా రనౌత్‌పై మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ బుధవారం ఓ ప్రకటనలో తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ‘‘ఓ మహిళా ప్రజాప్రతినిధివై ఉండి.. జెన్‌జీ మహిళా ఉద్యమకారుల పట్ల దిగజారుడు భాష వాడతావా? జెన్‌జీలతో పెట్టుకుని ప్రధాని మోదీనే తన మంత్రిని కాపాడుకోలేక పోయిండు. ఇక నీ స్థాయి ఎంత? నల్లచట్టాలపై రైతులు ఉద్యమం చేసినప్పుడు వారిని అవమానించి ఎయిర్‌పోర్టులో చెంపదెబ్బ తిన్న విషయాన్ని మరిచావా?’’ అని విమర్శించారు. జెన్‌జీ మహిళలకు వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ‘‘పార్లమెంటు సభ్యురాలిగా సభలో ప్రజాసమస్యలపై మాట్లాడటానికి బదులుగా మహిళలను అవమానిస్తూ మాట్లాడటానికి సిగ్గనిపించట్లేదా?’’ అని విమర్శించారు.