Share News

వివాహేతర సంబంధం వద్దన్నందుకు కత్తితో దాడి

ABN , Publish Date - Jul 29 , 2026 | 07:41 AM

వివాహేతర సంబంధం వద్దన్నందుకు ఆరుగురిపై ఓ యువకుడు కత్తితో దాడి చేశాడు. జనగామ జిల్లాలో సోమవారం రాత్రి జరిగిందీ ఘటన. జిల్లాలోని పాలకుర్తి మండలంలో ఓ గ్రామానికి చెందిన కొడిశాల అజయ్‌(26) పెయింటర్‌గా పనిచేస్తున్నాడు. అతని భార్య ఏడాది క్రితం చనిపోయింది. అనంతరం అతనికి..

వివాహేతర సంబంధం వద్దన్నందుకు కత్తితో దాడి

  • ఆరుగురిని గాయపరిచిన యువకుడు.. జనగామ జిల్లాలో ఘటన

పాలకుర్తి, జూలై 28 (ఆంధ్రజ్యోతి): వివాహేతర సంబంధం వద్దన్నందుకు ఆరుగురిపై ఓ యువకుడు కత్తితో దాడి చేశాడు. జనగామ జిల్లాలో సోమవారం రాత్రి జరిగిందీ ఘటన. జిల్లాలోని పాలకుర్తి మండలంలో ఓ గ్రామానికి చెందిన కొడిశాల అజయ్‌(26) పెయింటర్‌గా పనిచేస్తున్నాడు. అతని భార్య ఏడాది క్రితం చనిపోయింది. అనంతరం అతనికి అదే గ్రామానికి చెందిన ఓ మహిళతో వివాహేతర సంబంధం ఏర్పడింది. ఆమెకు భర్త, నలుగురు పిల్లలు ఉన్నారు. ఈ విషయమై కొంతకాలంగా ఇరు కుటుంబాల మధ్య గొడవలు జరుగుతున్నాయి. అయినా అజయ్‌ ప్రవర్తనలో మార్పు రాలేదు. దీంతో మహిళ భర్త, మరో ఐదుగురు సోమవారం అర్ధరాత్రి అజయ్‌ ఇంటికి వెళ్లారు. మహిళతో సంబంధం మానుకోవాలనిచెప్పారు. ఈ క్రమంలో వారి మధ్య వాగ్వాదం జరిగింది. ఓ వ్యక్తి అజయ్‌ను గాయపరచగా, ఆగ్రహంతో అతడు ఇంట్లోకి వెళ్లి కత్తి తెచ్చి ఆ ఆరుగురిపైనా దాడికి తెగబడ్డాడు. క్షతగాత్రులను హన్మకొండలోని ఓ ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు అజయ్‌ని అదుపులోకి తీసుకున్నారు.

Updated Date - Jul 29 , 2026 | 07:41 AM