కేసీఆర్‌ను ఎందుకు అరెస్టు చేయడం లేదు?
ABN , Publish Date - Jan 31 , 2026 | 04:29 AM
ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్‌ను ఎందుకు అరెస్టు చేయడం లేదని ప్రభుత్వాన్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రాంచందర్‌రావు ప్రశ్నించారు.
విచారణ పేరుతో కాలయాపన
బీఆర్‌ఎస్ మునిగిపోతున్న నావ
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్
జగిత్యాల, జనవరి 30 (ఆంధ్రజ్యోతి): ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్‌ను ఎందుకు అరెస్టు చేయడం లేదని ప్రభుత్వాన్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రాంచందర్‌రావు ప్రశ్నించారు. నోటీసులు, విచారణ పేరుతో కాలయాపన చేస్తున్నార ని విమర్శించారు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీలు లోపాయికారిఒప్పందం చేసుకొని ప్రజలను మోసం చేస్తున్నాయని ఆరోపించారు. శుక్రవారం రాత్రి జగిత్యాలలోని మునిసిపల్ టౌన్ హాలులో నిర్వహించిన బీజేపీ విజయ శంఖారావ సంకల్ప సభలో ఆయన మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్ పార్టీ మునిగిపోతున్న నావ లాంటిదని అన్నారు. అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే కేసీఆర్‌కు జైలుకు పంపుతానని, కేసీఆర్‌కు జైలులో డబుల్ బెడ్ రూంను కట్టిస్తానని చె ప్పిన సీఎం రేవంత్‌రెడ్డి.. కనీసం ఇందిరమ్మ ఇళ్లు కూడా కట్టించలేదని ఎద్దేవా చేశారు. ఫోన్‌ట్యాపింగ్ కేసులో కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావులను ఎందుకు అరెస్టు చేయడం లేదని నిలదీశారు. రాష్ట్రానికి ద్రోహం చేసినవారు పోలీ్‌సస్టేషన్ల చుట్టూ తిరుగుతూ గల్లాలు ఎగరేవేస్తున్నారని విమర్శించారు.
కాంగ్రెస్ ప్రతి హామీ అబద్ధమే
ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ప్రతి హామీ అబద్ధమేనని రాంచందర్‌రావు విమర్శించారు. రూ.4 వేల నిరుద్యోగ భృతి, విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్, ఉద్యోగ అవకాశాలు, రైతుభరోసా ఎక్కడ అని ప్రశ్నించారు. ప్రజలను మోసం చేయడమే కాంగ్రెస్ నైజం అని ధ్వజమెత్తారు. బొగ్గు కుంభకోణంలో బీఆర్‌ఎస్, కాంగ్రెస్ రెండింటికీ పాత్ర ఉందని ఆరోపించారు. తెలంగాణను రక్షించాలంటే మునిసిపల్ ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఎంపీ అర్వింద్ మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డికి చీము నెత్తురు ఉంటే కేసీఆర్‌ను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావులకు నోటీసులు ఇచ్చుడు, డబ్బు సంచులు తీసుకునుడు అలవాటుగా మారిందని ఆరోపించారు.