యూఎస్‌ఎస్ అబ్రహం లింకన్‌వైపుఇరాన్ డ్రోన్
ABN , Publish Date - Feb 04 , 2026 | 03:04 AM
ఉద్రిక్తతలు తగ్గించుకొనేందుకు అమెరికా, ఇరాన్ దేశాల ప్రతినిధులు చర్చలకు సిద్ధమైన వేళ.. అరేబియా సముద్రంలో అసాధారణ ఘటన జరిగింది.
మధ్యలోనే కూల్చేసిన అమెరికా నౌకాదళం
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 3: ఉద్రిక్తతలు తగ్గించుకొనేందుకు అమెరికా, ఇరాన్ దేశాల ప్రతినిధులు చర్చలకు సిద్ధమైన వేళ.. అరేబియా సముద్రంలో అసాధారణ ఘటన జరిగింది. ఇరాన్‌కు దాదాపు 500 కిలోమీటర్ల దూరంలో అరేబియా సముద్రంలో మోహరించి ఉన్న అమెరికా విమాన వాహక నౌక యూఎ్‌సఎస్ అబ్రహం లింకన్‌వైపు ఇరాన్ డ్రోన్ దూసుకొచ్చిందని అమెరికా నేవీ ప్రతినిధి కెప్టెన్ హాకిన్స్ మంగళవారం తెలిపారు. ఆ డ్రోన్‌ను ఎఫ్-35సీ ఫైటర్ జెట్ విమానం ద్వారా మధ్యలోనే కూల్చివేశామని వెల్లడించారు. ఈ ఘటన జరిగిన రెండు గంటలకే హార్ముజ్ జలసంధిలో అమెరికా పతాకంతో ప్రయాణిస్తున్న ఓ కెమికల్ ట్యాంకర్‌ను ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్‌కు చెందిన రెండు గన్‌బోట్లు అడ్డగించాయని కెప్టెన్ హాకిన్స్ ఆరోపించారు.