Share News

విదేశాంగ శాఖకు కేటాయింపులు నిరాశాజనకం

ABN , Publish Date - Feb 02 , 2026 | 03:04 AM

కేంద్ర బడ్జెట్‌లో విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు 22,118.97 కోట్లు కేటాయించారు. గతేడాది కేటాయించిన 21,742 కోట్లతో పోల్చితే 376 కోట్లు అదనంగా ఉన్నా..

విదేశాంగ శాఖకు కేటాయింపులు నిరాశాజనకం

  • పాస్‌పోర్టుల జారీ వేగవంతానికి పెరిగిన కేటాయింపులు

(ఆంధ్రజ్యోతి గల్ఫ్‌ప్రతినిధి)

కేంద్ర బడ్జెట్‌లో విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు 22,118.97 కోట్లు కేటాయించారు. గతేడాది కేటాయించిన 21,742 కోట్లతో పోల్చితే 376 కోట్లు అదనంగా ఉన్నా.. రూపాయి పతనం, డాలర్‌ మారకం విలువతో పోల్చితే బడ్జెట్‌ కేటాయింపులు తక్కువేనని చెప్పుకోవాలి. పాస్‌ పోర్టుల జారీ ప్రక్రియ సరళీకృతం, వేగవంతం కోసం ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్న కేంద్రం అవే పాస్‌ పోర్టులతో విదేశాలకు వెళ్లిన తర్వాత వారిని పట్టించుకునే విషయంలో అలసత్వం ప్రదర్శిస్తున్నది. 2026-27 బడ్జెట్‌లో పాస్‌ పోర్టు, ఇమ్మిగ్రేషన్‌ కోసం 2435 కోట్లు కేటాయించారు. గతంతో పోల్చితే ఇది 435 కోట్లు అదనం. ఇక ప్రవాసీయుల సంక్షేమానికి వచ్చేసరికి, గల్ఫ్‌ దేశాలలో కష్టాల్లో ఉన్న భారతీయ మహిళలకు సహాయం అందించడానికి నిర్భయ నిధి కింద ఈసారి ఎలాంటి కేటాయింపులు చేయలేదు. మహిళల సహాయార్థం వన్‌ సర్వీస్‌ సెంటర్‌ కేంద్రాలను నెలకొల్పడానికి రూ.5 కోట్లను కేటాయించి చేతులు దులుపుకొన్నారు. గతంలో కూడా ఈ నిధులను ఖర్చు చేయలేదు.

Updated Date - Feb 02 , 2026 | 03:04 AM