Share News

టీకా వికటించి చిన్నారి మృతి

ABN , Publish Date - Feb 02 , 2026 | 02:49 AM

ప్రభు త్వ ఆస్పత్రిలో ఇచ్చిన టీకా వికటించి రెండున్నరేళ్ల చిన్నారి మృతి చెందింది. సిబ్బంది నిర్లక్ష్యం వల్లే తమ బిడ్డ ప్రాణాలు పోయాయని బంధువులు ఆస్పత్రి వద్ద ఆందోళనకు దిగారు.

టీకా వికటించి చిన్నారి మృతి

  • కామారెడ్డి ప్రభుత్వాస్పత్రి వద్ద బంధువుల ఆందోళన

కామారెడ్డి టౌన్‌, ఫిబ్రవరి 1 (ఆంధ్రజ్యోతి): ప్రభు త్వ ఆస్పత్రిలో ఇచ్చిన టీకా వికటించి రెండున్నరేళ్ల చిన్నారి మృతి చెందింది. సిబ్బంది నిర్లక్ష్యం వల్లే తమ బిడ్డ ప్రాణాలు పోయాయని బంధువులు ఆస్పత్రి వద్ద ఆందోళనకు దిగారు. ఈ ఘటన కామారెడ్డిలో జరి గింది. అయ్యప్పనగర్‌ కాలనీకి చెందిన అర్చన, రమేశ్‌ దంపతుల కుమార్తె క్రితశ్రను జనవరి 25న కుక్క కరవడంతో కామారెడ్డి ప్రభుత్వాస్పత్రికి తీసుకువెళ్లారు. వైద్యులు ఆమెకు యాంటీ రేబిస్‌ టీకా రెండు డోసులు ఇవ్వగా, ఆదివారం మూడో డోసు వేయించడానికి తండ్రి రమేశ్‌ బాలికను ఆస్పత్రికి తీసుకెళ్లారు. మధ్యాహ్నం టీకా వేయించుకుని తిరిగి ఇంటికి వెళ్తుండగా బాలిక తీవ్ర అస్వస్థతకు గురై ప్రాణాలు విడిచింది.

Updated Date - Feb 02 , 2026 | 02:49 AM