దుబాయిలో చిక్కుకున్న తుమ్మల
ABN , Publish Date - Mar 03 , 2026 | 03:46 AM
రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు దుబాయిలో చిక్కుకున్నారు. వైద్య సదస్సులో పాల్గొనేందుకు వెళ్లిన ఆయన పెద్ద అల్లుడు డాక్టర్ కల్యాణ్ శేఖర్..
హైదరాబాద్/ ఖమ్మం, మార్చి 2 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు దుబాయిలో చిక్కుకున్నారు. వైద్య సదస్సులో పాల్గొనేందుకు వెళ్లిన ఆయన పెద్ద అల్లుడు డాక్టర్ కల్యాణ్ శేఖర్.. బ్రెయిన్ స్ట్రోక్‌తో దుబాయి విమానాశ్రయంలో కుప్పకూలారు. దీంతో ఆయనను గత నెల 22న అక్కడి ఆస్పత్రిలో చేర్చారు. ఈసంగతి తెలియగానే హుటాహుటిన కుటుంబ సభ్యులతో కలిసి మంత్రి తుమ్మల గత నెల 23న దుబాయికి చేరుకున్నారు. కల్యాణ్ ఆరోగ్యం కాస్త కుదుటప డడంతో ఈ నెల 5న దుబాయి నుంచి తుమ్మల విమాన టికెట్ బుక్ చేసుకున్నారు. కానీ, ఇరాన్-అమెరికా మధ్య యుద్ధం నేపథ్యంలో దుబాయి విమానాశ్రయంపై దాడులు జరిగాయి. దీంతో ఆయన అక్కడే చిక్కుకుపోయా రు. కానీ, తన కుటుంబంతో కలిసి వినోదం కోసం దుబాయికి వెళ్లారని యూ-ట్యూబ్ చానళ్లు, సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై మంత్రి తుమ్మల ఆవేదనకు గురయ్యారు. కాగా, రైతులకు సబ్సిడీపై డ్రోన్లు పంపిణీ చేయనున్నట్లు తుమ్మల తెలిపారు. వ్యవసాయ యాంత్రీకరణ పథకంలో భాగంగా తొలి దశలో జిల్లాకు పది డ్రోన్లు పంపిణీ చేస్తామన్నారు.