టీఎస్ ఎడ్‌సెట్ షెడ్యూల్ విడుదల
ABN , Publish Date - Jan 29 , 2026 | 05:14 AM
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న బీఈడీ కళాశాలల్లో.. 2026-27 విద్యాసంవత్సరానికి ప్రవేశాల కోసం నిర్వహించే టీఎస్ ఎడ్ సెట్-2026 నోటిఫికేషన్ విడుదలైంది.
మే 12న పరీక్ష.. వచ్చే నెల 20 నుంచి దరఖాస్తుకు చాన్స్
కేయూ క్యాంపస్ జనవరి 28 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రవ్యాప్తంగా ఉన్న బీఈడీ కళాశాలల్లో.. 2026-27 విద్యాసంవత్సరానికి ప్రవేశాల కోసం నిర్వహించే టీఎస్ ఎడ్ సెట్-2026 నోటిఫికేషన్ విడుదలైంది. బుధవారం హైదరాబాద్‌లోని ఉన్నత విద్యామండలి కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఎడ్‌సెట్ కన్వీనర్ వెంకట్రామిరెడ్డి వివరాలను వెల్లడించారు. ఫిబ్రవరి 20న అధికారిక షెడ్యూల్ విడుదల చేసి, 23 నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులను స్వీకరిస్తామని తెలిపారు. మే 12న ఆన్‌లైన్ పద్ధతిలో ప్రవేశ పరీక్ష నిర్వహిస్తామని, పరీక్ష రెండు సెషన్లలో జరుగుతుందని చెప్పారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు మొదటి సెషన్, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4గంటల వరకు రెండో సెషన్ నిర్వహిస్తామని వెంకట్రామిరెడ్డి ప్రకటించారు.