Share News

అభ్యర్థుల ఓటీఆర్‌ అప్‌డేట్‌ తప్పనిసరి: టీజీపీఎస్సీ

ABN , Publish Date - Feb 03 , 2026 | 03:13 AM

త్వరలో కొత్త నియామక నోటిఫికేషన్లు విడుదల చేయనున్న నేపథ్యంలో తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీజీపీఎస్సీ) అభ్యర్థుల వన్‌టైమ్‌ రిజిస్ట్రేషన్‌ ..

అభ్యర్థుల ఓటీఆర్‌ అప్‌డేట్‌ తప్పనిసరి: టీజీపీఎస్సీ

త్వరలో కొత్త నియామక నోటిఫికేషన్లు విడుదల చేయనున్న నేపథ్యంలో తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీజీపీఎస్సీ) అభ్యర్థుల వన్‌టైమ్‌ రిజిస్ట్రేషన్‌ (ఓటీఆర్‌) వివరాల అప్‌డేట్‌ తప్పనిసరి చేసింది. ప్రస్తుతం కమిషన్‌ వద్ద నమోదైన సుమారు 31.56 లక్షల మంది అభ్యర్థులు తమ వ్యక్తిగత, విద్యార్హతలు, కేటగిరీ వివరాలను అప్‌డేట్‌ చేయాల్సి ఉంటుందని టీజీపీఎస్సీ తెలిపింది. షెడ్యూల్డ్‌ కులాల వర్గీకరణ, కొత్త అర్హతలు, ఇతర వివరాల మార్పుల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు కమిషన్‌ స్పష్టం చేసింది. భవిష్యత్తులో విడుదలయ్యే అన్ని నోటిఫికేషన్లు, దరఖాస్తులు, ఫలితాలు పూర్తిగా ఈ సమాచారంపైనే ఆధారపడి ఉంటాయని పేర్కొంది. అభ్యర్థులు తమ తాజా ఫొటోతో పాటు అవసరమైన సర్టిఫికెట్లను తప్పనిసరిగా అప్‌లోడ్‌ చేయాలని సూచించింది. అప్‌డేట్‌ గడువును ఫిబ్రవరి 25 వరకు పొడిగించినట్లు టీజీపీఎస్సీ చైర్మన్‌ బుర్ర వెంకటేశం సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. నిర్ణీత గడువులో వివరాలు నవీకరించని అభ్యర్థులు రాబోయే నియామకాలకు అనర్హులవుతారని ఆయన హెచ్చరించారు.

Updated Date - Feb 03 , 2026 | 03:13 AM