Share News

నీటి ప్రాజెక్టులకు సాయమేది?!

ABN , Publish Date - Feb 02 , 2026 | 03:07 AM

రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టులకు 2026-27 ఆర్థిక సంవత్సర బడ్జెట్‌లో నిరాశే మిగిలింది. పాలమూరు-రంగారెడ్డి, ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టులకు జాతీయ హోదా కల్పించడంతోపాటు కేంద్ర సాయం అందించాలని కేంద్రానికి తెలంగాణ ప్రభుత్వ అభ్యర్థన అరణ్య రోదనే అయ్యింది.

నీటి ప్రాజెక్టులకు సాయమేది?!

  • ఊసే లేని పాలమూరు-రంగారెడ్డి

హైదరాబాద్‌, ఫిబ్రవరి 1 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టులకు 2026-27 ఆర్థిక సంవత్సర బడ్జెట్‌లో నిరాశే మిగిలింది. పాలమూరు-రంగారెడ్డి, ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టులకు జాతీయ హోదా కల్పించడంతోపాటు కేంద్ర సాయం అందించాలని కేంద్రానికి తెలంగాణ ప్రభుత్వ అభ్యర్థన అరణ్య రోదనే అయ్యింది. కేంద్ర సాయం గానీ, ప్రధానమంత్రి కృషి సించాయ్‌ యోజన (పీఎంకేఎ్‌సవై) కిందైనా సాయమందించాలని తెలంగాణ సర్కారు కోరినా ఫలితం లేకపోయింది. గత ఆర్థిక సంవత్సరంలో పీఎంకేఎ్‌సవై కింద రూ.8,260 కోట్లు కేటాయించిన కేంద్రం.. ఈసారి రూ.6,587 కోట్లకు కేటాయింపులను తగ్గించింది. 2026-31 మధ్య పీఎంకేఎ్‌సవై-ఏఐబీపీ కింద ప్రాణహిత-చేవెళ్ల, మక్తల్‌ -నారాయణపేట-కొడంగల్‌, పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాలకు సాయం అందించాలని కేంద్ర జలశక్తిశాఖ మంత్రి సీఆర్‌ పాటిల్‌కు రాష్ట్ర నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్‌ పలు లేఖలు రాశారు. వీటికి కేంద్ర జల వనరుల సంఘం (సీడబ్ల్యూసీ) క్లియరెన్స్‌ల్లేవన్న కారణాలు చెప్పి సాయం నిరాకరించారని తెలుస్తోంది. సీడబ్ల్యూసీ క్లియరెన్స్‌తోపాటు సాంకేతిక సలహా కమిటీ అనుమతి కూడా లభించిన సీతారామ ఎత్తిపోతల పథకం/సీతమ్మసాగర్‌ బహుళార్థ సాధక ప్రాజెక్టు, ముక్తేశ్వర్‌ (చిన్నకాళేశ్వరం), మొడికుంట వాగు, చనకా కొరాట డిస్ట్రిబ్యూటరీలనైౖనా పీఎంకేఎ్‌సవైలో చేరిస్తే సర్కారుకు ఊరట లభించేది.

Updated Date - Feb 02 , 2026 | 03:07 AM