త్వరలో ‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ 2.0’
ABN , Publish Date - Feb 25 , 2026 | 01:29 AM
తెలంగాణను అంతర్జాతీయ పెట్టుబడులకు గమ్యస్థానంగా మార్చాలనే లక్ష్యంతో త్వరలోనే ‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ 2.0’కు శ్రీకారం...
రాష్ట్రాన్ని అంతర్జాతీయ పెట్టుబడులకు గమ్యస్థానం చేయడమే లక్ష్యం
ఇతర రాష్ట్రాలకు రోల్ మోడల్‌గా నిలిచేలా కొత్త విధానం రూపకల్పన
రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు ముందుకురావాలి
పారిశ్రామికవేత్తలకు మంత్రి శ్రీధర్‌బాబు ఆహ్వానం
హైదరాబాద్, ఫిబ్రవరి 24 (ఆంధ్రజ్యోతి): తెలంగాణను అంతర్జాతీయ పెట్టుబడులకు గమ్యస్థానంగా మార్చాలనే లక్ష్యంతో త్వరలోనే ‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ 2.0’కు శ్రీకారం చుట్టబోతున్నామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పేర్కొన్నారు. రాష్ట్రంలో పెట్టుబడిదారులకు పూర్తిస్థాయిలో భరోసా కల్పించేలా, ఇతర రాష్ట్రాలకు రోల్ మోడల్‌గా నిలిచేలా అందరితో చ ర్చించి ఈ కొత్త విధానాన్ని రూపొందిస్తామన్నారు. మంగళవారం జూబ్లీహిల్స్‌లోని జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్‌లో ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ చాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (ఎఫ్‌టీసీసీఐ) ఆధ్వర్యంలో నిర్వహించిన ‘గ్రోత్ ఎక్స్ 2026’ సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. గ్రోత్ అంటే యాదృచ్ఛికంగా వచ్చేది కాదని, భావితరాల భవిష్యత్తు కోసం శాస్త్రీయంగా, ప్రణాళికాబద్ధంగా రూపొందించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఆ దిశగానే రాష్ట్రప్రభుత్వం ‘తెలంగాణ విజన్ 2047’ను రూపొందించిందన్నారు. ప్రస్తుతం 200 బిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఉన్న తెలంగాణను, 2034నాటికి ఒక ట్రిలియన్ డాలర్లకు, 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్లకు చేర్చాలన్నదే తమ లక్ష్యమని పునరుద్ఘాటించారు. ఈ లక్ష్య సాధనకు, రాష్ట్ర సమగ్రాభివృద్థికి ‘‘క్యూర్-ప్యూర్-రేర్’’ అనే త్రిముఖ వ్యూ హాన్ని అమలు చేస్తున్నామన్నారు. అన్ని ప్రాంతాల ను వృద్ధి పథంలోకి తీసుకెళ్లడమే తమ అజెండా అని స్పష్టం చేశారు. ఏఐ, ఇండస్ట్రీ 5.0 లాంటి టెక్నాలజీ్‌సతో వర్క్ కల్చర్‌లో మార్పు వచ్చిందని, రాబోయే రోజుల్లో కంపెనీల కంటే ‘‘ఎకో సిస్టం’’కే ప్రాధాన్యత ఉంటుందన్నారు. పరిశ్రమలకు కేవలం అనుమతులు ఇచ్చే వ్యవస్థలా కాకుండా, వారితో కలిసి నడిచే భాగస్వామిగా ఉంటుందని, రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పని చేసేందుకు ముందుకు రావాలని పారిశ్రామికవేత్తలను మంత్రి ఆహ్వానించారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు, ప్రముఖ వైద్యుడు డా.నాగేశ్వర్ రెడ్డి, ఎఫ్‌టీసీసీఐ ప్రెసిడెంట్ ఆర్.రవి కుమార్, స్కై రూట్ ఏరో ేస్పస్ ప్రతినిధి పవన్, గ్రోత్ ఎక్స్ 2026 కన్వీనర్ పంకజ్ దివాన్ తదితరులు పాల్గొన్నారు.