Share News

బడ్జెట్‌లో రావాల్సిన నిధులపై దృష్టి పెట్టండి

ABN , Publish Date - Feb 04 , 2026 | 03:14 AM

కేంద్ర బడ్జెట్‌లో జనాభా ప్రాతిపదికన రాష్ట్రానికి రావాల్సిన రూ.35 వేల కోట్ల నిధులను సాధించేందుకు తగు చర్యలు తీసుకోవాలని వివిధ శాఖల ముఖ్య కార్యదర్శులను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి...

బడ్జెట్‌లో రావాల్సిన నిధులపై దృష్టి పెట్టండి

  • తగిన కార్యాచరణ చేపట్టాలని కార్యదర్శులకు సీఎస్‌ ఆదేశం

హైదరాబాద్‌, ఫిబ్రవరి 3 (ఆంధ్రజ్యోతి): కేంద్ర బడ్జెట్‌లో జనాభా ప్రాతిపదికన రాష్ట్రానికి రావాల్సిన రూ.35 వేల కోట్ల నిధులను సాధించేందుకు తగు చర్యలు తీసుకోవాలని వివిధ శాఖల ముఖ్య కార్యదర్శులను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు ఆదేశించారు. కేంద్ర బడ్జెట్‌పై అన్నిశాఖల కార్యదర్శులతో మంగళవారం జరిగిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ.. కేంద్రం బడ్జెట్‌లో సీఎ్‌సఎ్‌సలో 5 లక్షల కోట్లు ప్రతిపాదించగా, 15ు జనాభా గల తెలంగాణకు 25 వేల కోట్లు రావాల్సి ఉందన్నారు. ఇతర అంశాల్లో మరో రూ.10 వేల కోట్లు రావాలని చెప్పారు. బడ్జెట్‌లో ప్రాధాన్య రంగాలుగా ఉన్న వ్యవసాయం, ఫార్మా, సెమీ కండక్టర్ల తయారీ రంగాలతోపాటు రాష్ట్రానికి రావాల్సిన అన్ని రకాల నిధుల సాధనకు కార్యాచరణ రూపొందించాలన్నారు. రెండో దశ ‘సులభతర వాణిజ్య విధానం(ఈఓడీబీ)’లో సంస్కరణలు చేపట్టడానికి 23 అంశాలను గుర్తించామని సీఎస్‌ తెలిపారు. మరో ఐదు పాక్షిక అంశాలు కూడా ఉన్నాయని ఈఓబీడీపై కేంద్ర ప్రభుత్వ కార్యదర్శి సుకృతి లేఖి బృందంతో జరిగిన సమీక్షలో చెప్పారు. ఇందుకు అవసరమైన చట్ట సవరణలు, మార్పులు చేయడానికి కార్యాచరణ రూపొందించుకోవాలని అధికారులను ఆదేశించారు.

Updated Date - Feb 04 , 2026 | 03:14 AM