విద్యారంగంలో తెలంగాణకు మరిన్ని నిధులు!
ABN , Publish Date - Feb 02 , 2026 | 03:15 AM
కేంద్ర బడ్జెట్‌లో విద్యారంగానికి కేటాయింపులు పెరిగినందున రాష్ట్రానికి ఈ రంగంలో వచ్చే నిధులు పెరగనున్నాయి.
హైదరాబాద్, ఫిబ్రవరి 1(ఆంధ్రజ్యోతి): కేంద్ర బడ్జెట్‌లో విద్యారంగానికి కేటాయింపులు పెరిగినందున రాష్ట్రానికి ఈ రంగంలో వచ్చే నిధులు పెరగనున్నాయి. ముఖ్యంగా రాష్ట్రంలోని కేంద్రీయ విద్యాయాలు(కేవీ), జవహర్ నవోదయ విద్యాలయాలు(జేఎన్‌వీ) మరింత అభివృద్ధి చెందనున్నాయి. రాష్ట్రంలో 35 కేవీలు ఇప్పటికే ఉండగా.. కొత్తగూడెం, ములుగు, జగిత్యాల, వనపర్తి జిల్లాలకు కేవీలను కేంద్రం ఇటివల మంజూరుచేసింది. అలాగే ప్రస్తుతం 9 జేఎన్‌వీలు ఉండగా కొత్తగా మరో 7 మంజూరు చేసింది. మరోవైపు, దేశవ్యాప్తంగా 5 యూనివర్సిటీ టౌన్‌షి్‌పలు ఏర్పాటు చేస్తామని బడ్జెట్‌లో ప్రతిపాదించారు. వీటిల్లో ఒకటి తెలంగాణకు కేటాయించే అవకాశాలున్నాయి.