Share News

డిప్యూటీ సీఎం క్యాంపు కార్యాలయాలకు 6 కోట్లు

ABN , Publish Date - Mar 03 , 2026 | 03:52 AM

రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క క్యాంపు కార్యాలయాల కోసం ప్రభుత్వం నిధులు కేటాయించింది.

డిప్యూటీ సీఎం క్యాంపు కార్యాలయాలకు 6 కోట్లు

హైదరాబాద్‌, మార్చి 2 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క క్యాంపు కార్యాలయాల కోసం ప్రభుత్వం నిధులు కేటాయించింది. ఖమ్మంలో కొత్తది, మధిరలోని క్యాంపు కార్యాలయంలో మరమ్మతులకు అవసరమైన రూ.6 కోట్లకు పరిపాలనా అనుమతులు విడివిడిగా మంజూరు చేసింది. ఖమ్మంలోని ఎన్నెస్పీ క్వార్టర్స్‌ లైన్‌లో ఇప్పటికే ఉన్న క్యాంపు కార్యాలయం స్థలంలో కొత్తది నిర్మించనున్నారు. ఇందుకోసం రూ.4.50 కోట్లకు అనుమతి వచ్చింది. అలాగే భట్టి సొంత నియోజకవర్గమైన మధిరలోని క్యాంపు కార్యాలయంలో మరమ్మతుల కోసం రూ.1.50కోట్ల నిధులకు కూడా పాలనా అనుమతినిచ్చారు.

Updated Date - Mar 03 , 2026 | 03:52 AM