Share News

ఇది సంస్కరణల ఎక్స్‌ప్రెస్‌!

ABN , Publish Date - Feb 02 , 2026 | 03:51 AM

ఈ బడ్జెట్‌ ‘సంస్కరణల ఎక్స్‌ప్రె్‌స’ అని కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి అభివర్ణించారు. రక్షణ రంగాన్ని మరింత శక్తిమంతం చేసుకుంటూ..

ఇది సంస్కరణల ఎక్స్‌ప్రెస్‌!

  • కేంద్ర బడ్జెట్‌తో తెలంగాణకూ లబ్ధి: కిషన్‌రెడ్డి

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 1 (ఆంధ్రజ్యోతి): ఈ బడ్జెట్‌ ‘సంస్కరణల ఎక్స్‌ప్రె్‌స’ అని కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి అభివర్ణించారు. రక్షణ రంగాన్ని మరింత శక్తిమంతం చేసుకుంటూ.. రైల్వే, ఫార్మా, వ్యవసాయం, మహిళా సంక్షేమం వంటి రంగాలకు ప్రాధాన్యం లభించిందనిచెప్పారు. ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ దీర్ఘకాల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని బడ్జెట్‌ను రూపొందించినట్లు తెలిపారు. 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా మారేందుకు ఈ బడ్జెట్‌ తొలి అడుగు అని చెప్పారు. కేంద్ర బడ్జెట్‌తో తెలంగాణకు మేలు కలుగుతుందన్నారు. తెలంగాణకు 2025-26లో పన్నుల వాటాగా రూ.29,280కోట్లు రాగా 2026-27లో 13.5శాతం పెరుగుదలతో రూ.33,180కోట్లు వస్తాయని తెలిపారు. 7 హైస్పీడ్‌ రైల్‌ కారిడార్లను ప్రకటిస్తే అందులో మూడు హైదరాబాద్‌ నుంచే ప్రారంభమవుతున్నాయని గుర్తుచేశారు. బయోఫార్మా శక్తి పథకం ద్వారా ఫార్మా, టీకాల రాజధానిగా ఉన్న హైదరాబాద్‌కు మరింత లబ్ధి చేకూరుతుందని చెప్పారు. ఎరువుల సబ్సిడీలో సింహభాగం తెలంగాణకే కేటాయించినట్లు తెలిపారు. తెలంగాణలోని 33 జిల్లాలకు ఒక్కో బాలికల హాస్టల్‌ రానుందన్నారు.

Updated Date - Feb 02 , 2026 | 03:51 AM