Share News

ఆర్టీసీలో సమ్మె సైరన్‌

ABN , Publish Date - Mar 14 , 2026 | 06:15 AM

సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ ఆర్టీసీ కార్మికులు ప్రభుత్వానికి సమ్మె నోటీసు ఇచ్చారు.

ఆర్టీసీలో సమ్మె సైరన్‌

హైదరాబాద్‌, మార్చి 13(ఆంధ్రజ్యోతి): సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ ఆర్టీసీ కార్మికులు ప్రభుత్వానికి సమ్మె నోటీసు ఇచ్చారు. ఈ మేరకు ఆర్టీసీ జేఏసీ చైర్మన్‌ వెంకన్న నేతృత్వంలో జేఏసీ నాయకులు, కార్మికులు బస్‌ భవన్‌లో అధికారులకు శుక్రవారం సమ్మె నోటీసు అందజేశారు. విధిలేని పరిస్థితుల్లో సమ్మె నోటీసు ఇచ్చినట్లు జేఏసీ నాయకులు తెలిపారు. 2021 వేతన సవరణ 30 శాతం ఫిట్‌మెంట్‌తో అమలుచేయాలని డిమాండ్‌ చేశారు.

Updated Date - Mar 14 , 2026 | 06:15 AM