మతతత్వ శక్తుల మాటల మాయలో పడొద్దు
ABN , Publish Date - Mar 16 , 2026 | 04:06 AM
ఇది మన ప్రభుత్వం.. నేను మీ సోదరుడిని.. ప్రభుత్వానికి మీ అందరి ఆశీస్సులు కావాలి. మన అందరి మధ్యలో మంట పెట్టేందుకు కొందరు ప్రయత్నిస్తుంటారు.
అన్ని మతాలు ఒక్కటైతేనే రాష్ట్రాభివృద్ధి
ఈ ప్రభుత్వం మనది నేను మీ సోదరుడ్ని
రాష్ట్ర ప్రభుత్వ ఇఫ్తార్ విందులో రేవంత్
హైదరాబాద్, మార్చి 15(ఆంధ్రజ్యోతి): ‘ఇది మన ప్రభుత్వం.. నేను మీ సోదరుడిని.. ప్రభుత్వానికి మీ అందరి ఆశీస్సులు కావాలి. మన అందరి మధ్యలో మంట పెట్టేందుకు కొందరు ప్రయత్నిస్తుంటారు. వారి మాటల మాయలో పడొద్దు. హిందు, ముస్లిం, సిక్కు, క్రైస్తవులు.. మనమందరం సోదరులం. మనం కలిస్తేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతోంది. రాష్ట్ర మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తుంది’ అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో ఆదివారం నిర్వహించిన రంజాన్ ఇఫ్తార్ విందుకు హాజరైన సీఎం రేవంత్ ఈ వ్యాఖ్యలు చేశారు. విలువలు గుర్తు చేసే పవిత్ర మాసం రంజాన్ అన్నారు. ప్రజల్లో సఖ్యత భావం రావాలని, అన్ని మతాల మధ్య సామరస్యం కోసం ప్రయత్నిస్తున్నామన్నారు. తమ ప్రభుత్వం మైనార్టీలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని పునరుద్ఘాటించారు. ఇదే ఎల్బీస్టేడియంలో క్రికెట్ ఆడిన అజారుద్దీన్‌కు మంత్రి పదవి ఇచ్చామని, 4శాతం రిజర్వేషన్లలో కీలకపాత్ర పోషించిన షబ్బీర్ అలీని ప్రభుత్వ సలహాదారుగా నియమించామని గుర్తు చేశారు. అలాగే, 8 మంది మైనార్టీలను వివిధ కార్పొరేషన్లకు ఛైర్మన్లుగా నియమించామని, క్రికెట్ ప్రపంచక్‌పలో చాంపియన్‌గా నిలిచిన మహ్మద్ సిరాజ్‌ను డీఎస్పీగా నియమించామని, బాక్సింగ్ చాంపియన్ నిఖత్ జరీన్‌కు డీఎస్పీ ఉద్యోగంతోపాటు రూ. 2కోట్ల ఆర్థిక సాయం అందించామని సీఎం వివరించారు. ప్రతీ సంక్షేమ కార్యక్రమంలో మైనార్టీలకు సింహభాగం కేటాయిస్తున్నామని చెప్పారు. సోదరభావం, సమానత్వాన్ని బోధించే ఖురాన్‌ను చదవాలని, ఆచరించాలని సీఎం ఈ సందర్భంగా కోరారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ మాట్లాడుతూ.. సమీకృత గురుకులాలతో మైనార్టీలకు లబ్ధి జరగబోతోందన్నారు. 4శాతం రిజ్వేషన్లతో గత 18 ఏళ్లలో రాష్ట్రంలో 22 లక్షల మంది ముస్లింలకు లబ్ధి జరిగిందని, అనేకమంది ఉన్నత విద్య అభ్యసించారని చెప్పారు. ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం 90 వేల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తే.. మైనార్టీలకూ లబ్ధి జరిగిందన్నారు. ప్రజల మధ్య గొడవలు సృష్టించేందుకు కొన్ని శక్తులు నిత్యం కుట్రలు చేస్తున్నాయని, రాష్ట్రంలో వారి ఆలోచనలు విజయవంతం కావని స్పష్టం చేశారు. కాంగ్రెస్ సెక్యులర్ ప్రభుత్వానికి మద్దతు పలకాలని షబ్దీర్ అలీ కోరారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ, మంత్రులు అజారుద్దీన్, పొంగులేటి శ్రీని