పదేళ్లు ప్రజలను విస్మరించారు
ABN , Publish Date - Feb 04 , 2026 | 03:27 AM
అధికారంలో ఉన్న పదేళ్లు ప్రజలను విస్మరించి ఫామ్‌హౌ్‌సకు పరిమితమైన వారు.. ఇప్పుడు ఎన్నికలు రాగానే ఓట్ల కోసం ఆరాటపడుతున్నారని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి బీఆర్‌ఎస్ నేతలనుద్దేశించి...
ఇప్పుడొచ్చి మాటలు చెబుతున్నారు: మంత్రి పొంగులేటి
ఖమ్మం రూరల్, ఫిబ్రవరి 3 (ఆంధ్రజ్యోతి): అధికారంలో ఉన్న పదేళ్లు ప్రజలను విస్మరించి ఫామ్‌హౌ్‌సకు పరిమితమైన వారు.. ఇప్పుడు ఎన్నికలు రాగానే ఓట్ల కోసం ఆరాటపడుతున్నారని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి బీఆర్‌ఎస్ నేతలనుద్దేశించి విమర్శించారు. ఖమ్మం జిల్లా ఏదులాపురం మునిసిపాలిటీలోని పలు వార్డుల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఆయన మాట్లాడారు. అధికారంలో ఉన్నప్పుడు నిరుపేదల ఇళ్ల స్థలాల గురించి పట్టించుకోకుండా అరాచకంగా వ్యవహరించిన వారు నేడు ప్రగల్బాలు పలుకుతున్నారని మండిపడ్డారు. నాడు పేదోడికి ఒక్క రేషన్ కార్డు ఇవ్వడానికి మనసు రాని వాళ్లకు మళ్లీ ఓట్లు వేయాలా అని ప్రశ్నించారు. అర్హులైన ప్రతీ పేదవాడికి రేషన్ కార్డు ఇచ్చి పేదల కడుపునింపిన చరిత్ర ప్రజాప్రభుత్వానిదన్నారు. గత పాలకులు చేసిన తప్పిదాలను ప్రజలు గమనించి కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని కోరారు.