Share News

మే 13న పాలిసెట్‌ ప్రవేశ పరీక్ష

ABN , Publish Date - Feb 03 , 2026 | 03:29 AM

ఇంజనీరింగ్‌, నాన్‌ ఇంజనీరింగ్‌ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే పాలిసెట్‌ పరీక్ష మే 13న జరగనుంది.

మే 13న పాలిసెట్‌ ప్రవేశ పరీక్ష

హైదరాబాద్‌ సిటీ, ఫిబ్రవరి 2 (ఆంధ్రజ్యోతి): ఇంజనీరింగ్‌, నాన్‌ ఇంజనీరింగ్‌ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే పాలిసెట్‌ పరీక్ష మే 13న జరగనుంది. ఈ మేరకు రాష్ట్ర సాంకేతిక విద్య, శిక్షణా మండలి (ఎస్‌బీటీఈటీ) సోమవారం పాలిసెట్‌- 2026 నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. సోమవారం నుంచే అర్హులైన పదో తరగతి విద్యార్థులు ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్‌ చేసుకోవచ్చని నోటిఫికేషన్‌లో పేర్కొంది. అయితే, రిజిస్ట్రేషన్‌కు తప్పనిసరి అయిన పదో తరగతి హల్‌టికెట్‌ నెంబర్లను ఎస్‌ఎ్‌ససీ బోర్డు ఇంకా జారీ చేయలేదు. దీంతో తొలిరోజే ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్లకు ఆటంకం ఏర్పడింది.

Updated Date - Feb 03 , 2026 | 03:29 AM