Share News

పోలవరం ముంపుపై అధ్యయనానికి కమిటీ

ABN , Publish Date - Feb 03 , 2026 | 02:56 AM

పోలవరం ప్రాజెక్టులో 150 అడుగుల ఎత్తు మేర నీటిని నిల్వ చేస్తే భద్రాచలం పట్టణం ముంపునకు గురయ్యే అవకాశం ఉందన్న ...

పోలవరం ముంపుపై అధ్యయనానికి కమిటీ

  • తెలంగాణ నుంచి ఒకరిని ప్రతిపాదించాలని కోరుతూ లేఖ రాసిన పోలవరం అథారిటీ

హైదరాబాద్‌, ఫిబ్రవరి 3 (ఆంధ్రజ్యోతి): పోలవరం ప్రాజెక్టులో 150 అడుగుల ఎత్తు మేర నీటిని నిల్వ చేస్తే భద్రాచలం పట్టణం ముంపునకు గురయ్యే అవకాశం ఉందన్న తెలంగాణ వాదనపై కేంద్రం స్పందించింది. ముంపుపై అధ్యయనానికి ఓ కమిటీని వేస్తున్నామని, ఇందులో తెలంగాణ తరఫున ఒక సభ్యుడిని ప్రతిపాదించాలని పోలవరం అథారిటీ సోమవారం లేఖ రాసింది. కాగా, ఈ కమిటీ కోసం ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌ స్థాయి అధికారిని ప్రతిపాదించాలని తెలంగాణ యోచిస్తోంది.

Updated Date - Feb 03 , 2026 | 02:56 AM