మార్ఫింగ్‌ను తీవ్రంగా పరిగణించాలి: హైకోర్టు
ABN , Publish Date - Feb 03 , 2026 | 03:01 AM
ఫొటోలు, వీడియోల మార్ఫింగ్‌ను తీవ్రంగా పరిగణించాల్సిందేనని హైకోర్టు అభిప్రాయపడింది. మార్ఫింగ్ లాంటి అక్రమ చర్యలను వ్యతిరేకించే హక్కు బాధితులకు ఉందని స్పష్టం చేసింది.
ఫొటోలు, వీడియోల మార్ఫింగ్‌ను తీవ్రంగా పరిగణించాల్సిందేనని హైకోర్టు అభిప్రాయపడింది. మార్ఫింగ్ లాంటి అక్రమ చర్యలను వ్యతిరేకించే హక్కు బాధితులకు ఉందని స్పష్టం చేసింది. సీఎం రేవంత్‌రెడ్డి మార్ఫింగ్ ఫొటోను సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశారంటూ మహబూబ్‌నగర్‌కు చెందిన కావలి వెంకటేశ్‌పై గతంలో ఎఫ్‌ఐఆర్ నమోదైంది. దీనికి కొట్టేయాలని వెంకటేశ్ హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై జస్టిస్ జె.శ్రీనివా్‌సరావు ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది. పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. పోలీసులు బీఎన్‌ఎ్‌సఎ్‌స చట్టంలోని నిబంధనలను పాటించడం లేదని, ‘అర్నేశ్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బిహార్ ’ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును అనుసరించడం లేద వాదించారు. వాదనలు విన్న ధర్మాసనం.. కౌంటర్ దాఖలు చేయాలని పోలీసులను ఆదేశిస్తూ తదుపరి విచారణను ఈ నెల 11కు వాయిదా వేసింది.