నేటి నుంచి ఓయూ దూరవిద్య ఎంబీఏ, ఎంసీఏకు దరఖాస్తులు
ABN , Publish Date - Feb 04 , 2026 | 02:57 AM
ఉస్మానియా విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ జి.రాంరెడ్డి సెంటర్ ఫర్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ద్వారా 2025-26 విద్యా సంవత్సరానికి దూరవిద్య విధానంలో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో...
18 వరకు స్వీకరణ, ఫిబ్రవరి 22న పరీక్ష
ఉస్మానియా యూనివర్సిటీ, ఫిబ్రవరి 3 (ఆంధ్రజ్యోతి): ఉస్మానియా విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ జి.రాంరెడ్డి సెంటర్ ఫర్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ద్వారా 2025-26 విద్యా సంవత్సరానికి దూరవిద్య విధానంలో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాల కోసం నోటిఫికేషన్ వెలువడింది. ఆన్‌లైన్ దరఖాస్తులు ఈనెల 4 నుంచి 18 వరకు స్వీకరించనున్నారు. ఆలస్య రుసుము రూ.500తో ఫిబ్రవరి 21 వరకు దరఖాస్తు చేయవచ్చు. పరీక్షను ఫిబ్రవరి 22న నిర్వహించనున్నారు. టీజీ ఐసెట్-2025లో క్వాలిఫై అయిన వారికి నేరుగా ప్రవేశం కల్పిస్తారు. యూజీసీ-డీఈబీ అనుమతితో కోర్సులను అందిస్తున్నట్టు డైరెక్టరేట్ ఆఫ్ అడ్మిషన్స్ డైరెక్టర్ ఐ.పాండురంగారెడ్డి తెలిపారు. మరిన్ని వివరాలకు ఠీఠీఠీ.ౌటఝ్చుఽజ్చీ.్చఛి.జీుఽ వెబ్ సైట్‌ను సందర్శించవచ్చు.