వాట్సప్ ద్వారా జేఈఈ, నీట్ డిజిటల్ మెటీరియల్
ABN , Publish Date - Feb 03 , 2026 | 03:26 AM
నీట్, జేఈఈ-2026 ప్రవేశ పరీక్షలకు సిద్థమవుతున్న విద్యార్థులకు ‘కోటా’ డిజిటల్ మెటీరియల్ సిద్థం...
హైదరాబాద్ సిటీ, ఫిబ్రవరి 2 (ఆంధ్రజ్యోతి): నీట్, జేఈఈ-2026 ప్రవేశ పరీక్షలకు సిద్థమవుతున్న విద్యార్థులకు ‘కోటా’ డిజిటల్ మెటీరియల్ సిద్థం చేసినట్లు ఐఐటీ- జేఈఈ/నీట్ ఫోరం తెలిపింది. ఈ డిజిటల్ మెటీరియల్‌లో 2025-26కు సంబంధించిన స్టడీ మెటీరియల్ (కాన్సెప్ట్స్, మల్టీపుల్ ఛాయిస్ ప్రశ్నలు), 2025 ‘కోటా’ గ్రాండ్ టెస్టులు, ‘కోటా’ ప్రీవియస్ టెస్టులు, ర్యాంక్ బూస్టర్ టెస్టులు, ఎన్‌సీఈఆర్‌టీ నీట్ క్వశ్చన్ బ్యాంక్‌ను వాట్సాప్ ద్వారా పొందవచ్చని పేర్కొంది. అలాగే ఉఛీఠజట్చఝ360.ఛిౌఝ వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చని సూచించింది. మరింత సమాచారం కోసం 9849016661 నంబర్‌కు వాట్సాప్ మెసేజ్ చేయాలని ఫోరం తెలిపింది.