Share News

ఎవరిపై కక్షసాధింపు లేదు : మంత్రి పొన్నం

ABN , Publish Date - Feb 02 , 2026 | 02:38 AM

ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎవరిపై కక్ష పూరితంగా వ్యవహరించడం లేదని, చట్టం ముందు అంతా సమానమేనని...

ఎవరిపై కక్షసాధింపు లేదు : మంత్రి పొన్నం

మహబూబాబాద్‌, ఫిబ్రవరి 1 (ఆంధ్రజ్యోతి) : ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎవరిపై కక్ష పూరితంగా వ్యవహరించడం లేదని, చట్టం ముందు అంతా సమానమేనని బీసీ సంక్షేమ, రవాణా శాఖమంత్రి, కాంగ్రెస్‌ పార్టీ మునిసిపల్‌ ఎన్నికల మానుకోట పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్‌చార్జి పొన్నం ప్రభాకర్‌ అన్నారు. మహబూబాబాద్‌ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. చట్టానికి ఎవరు అతీతులు కాదని, తనపని తాను చేసుకుపోతుందని పేర్కోన్నారు. ఫోన్‌ ట్యాపింగ్‌ కేసుపై బీఆర్‌ఎస్‌ రాద్ధాంతం చేస్తుందని విమర్శించారు.

Updated Date - Feb 02 , 2026 | 02:38 AM