Share News

క్రిటికల్‌ మినరల్స్‌పై సంయుక్త పరిశోధన

ABN , Publish Date - Jan 31 , 2026 | 03:53 AM

క్రిటికల్‌ మినరల్స్‌ రంగంలో సంయుక్త పరిశోధన, బోధన, శిక్షణ, ఆవిష్కరణల కోసం మహీం ద్రా విశ్వవిద్యాలయం- సంగారెడ్డి జిల్లా కందిలోని.....

క్రిటికల్‌ మినరల్స్‌పై సంయుక్త పరిశోధన

  • మహీంద్రా వర్సిటీ, ఐఐటీహెచ్‌ మధ్య ఎంవోయూ

హైదరాబాద్‌ సిటీ/కంది, జనవరి 30 (ఆంధ్రజ్యోతి): క్రిటికల్‌ మినరల్స్‌ రంగంలో సంయుక్త పరిశోధన, బోధన, శిక్షణ, ఆవిష్కరణల కోసం మహీం ద్రా విశ్వవిద్యాలయం- సంగారెడ్డి జిల్లా కందిలోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ హైదరాబాద్‌(ఐఐటీహెచ్‌) శుక్రవారం అవగాహన ఒప్పందం (ఎంవోయూ) కుదుర్చుకున్నాయి. క్రిటికల్‌ మినరల్స్‌, సస్టైనబుల్‌ మైనింగ్‌, అడ్వాన్స్‌డ్‌ ఇండస్ట్రియల్‌ ప్రాసె్‌సలపై రెండు సంస్థలు పరస్పరం సహకరించుకోనున్నాయి. మహీంద్రా వ ర్సిటీలోని ఇంటర్‌ డిసిప్లీనరీ విద్యా విధానాన్ని, ఐఐటీహెచ్‌లోని అత్యాధునిక పరిశోధన పర్యావరణ వ్యవస్థతో సమన్వయం చేయడం ద్వారా దేశీయంగా క్రిటికల్‌ మినరల్స్‌ అన్వేషణ, ప్రాసెసింగ్‌ సామర్థ్యాలను పెంపొందించడం ఈ ఒప్పందం లక్ష్యం. మైనింగ్‌ వ్యర్థాల వినియోగం, అరుదైన ఖనిజాల వెలికితీత, ప్రాసెస్‌ మోడలింగ్‌, సిమ్యులేషన్‌ వంటి కీలక రంగాల్లో రెండు సంస్థలు కలిసి పరిశోధనలు నిర్వహిస్తాయి. పరిశోధన ఫలితాలను పరిశ్రమలకు ఉపయోగపడే స్కేలబుల్‌ టెక్నాలజీలుగా మార్చడమే ఈ ఒప్పందం ప్రధాన లక్ష్యంగా చెబుతున్నారు. ఈ భాగస్వామ్యం జాతీయ క్రిటికల్‌ మినరల్‌ మిషన్‌ లక్ష్యాలకు అనుగుణంగా స్వదేశీ, స్థిరమైన సాంకేతిక పరిష్కారాలను ప్రోత్సహిస్తుందని మహీంద్రా విశ్వవిద్యాలయం వైస్‌ ఛాన్స్‌లర్‌ డా.యాజులు మెదురి తెలిపారు. క్రిటికల్‌ మినరల్స్‌ రంగంలో భారతదేశ స్వావలంబనకు విద్యా సహకారం అవసరమని ఐఐటీ హైదరాబాద్‌ డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ బి.ఎస్‌. మూర్తి పేర్కొన్నారు.

పోషకాహార పరిశోధనలపై హెచ్‌సీయూతో ఎన్‌ఐఎన్‌ ఒప్పందం

పోషకాహారం, ప్రజారోగ్య రంగాల్లో సరికొత్త పరిశోధనలకు నాంది పలకడమే లక్ష్యంగా హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయం (హెచ్‌సీయూ), జాతీయ పోషకాహార సంస్థ (ఎన్‌ఐఎన్‌) శుక్రవారం ఎంవోయూ కుదుర్చుకున్నాయి. శుక్రవారం హెచ్‌సీయూలో జరిగిన కార్యక్రమంలో హెచ్‌సీయూ వైస్‌చాన్స్‌లర్‌ బీజే రావు, ఎన్‌ఐఎన్‌ డైరెక్టర్‌ భారతి పాల్గొన్నారు.

Updated Date - Jan 31 , 2026 | 03:53 AM