ఆ ఎమ్మెల్యేలు బ్లాక్‌మెయిల్ చేస్తే కుదరదు
ABN , Publish Date - Jan 29 , 2026 | 06:00 AM
బీఆర్‌ఎస్ నుంచి కాంగ్రె్‌సలో చేరిన ఎమ్మెల్యేలు పార్టీనే బ్లాక్‌మెయిల్ చేయాలనుకుంటే కుదరదని టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీగౌడ్ చెప్పారు
నగర పోలీస్ కమిషనర్... అమాయకులను వేధిస్తున్నారు
మీడియాతో చిట్‌చాట్‌లో మధుయాష్కీగౌడ్
బీఆర్‌ఎస్ నుంచి కాంగ్రె్‌సలో చేరిన ఎమ్మెల్యేలు పార్టీనే బ్లాక్‌మెయిల్ చేయాలనుకుంటే కుదరదని టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీగౌడ్ చెప్పారు. వారి నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులను కూడా సమన్వయం చేసుకోవాల్సిందేనన్నారు. పాత, కొత్త నాయకులను సమన్వయం చేయాల్సిన బాధ్యత ఇన్‌ఛార్జి మంత్రులపైనే ఉందన్నారు. గాంధీభవన్‌లో మీడియాతో చిట్‌చాట్‌గా మాట్లాడారు. ప్రభుత్వానికి, పార్టీకి మధ్య సమన్వయ కమిటీని త్వరగా వేయాలన్నారు. మాజీ మంత్రి జీవన్‌రెడ్డి, పార్టీ కోసం కష్టపడ్డారని, కేసీఆర్ నుంచి ఎన్ని సార్లు ఆహ్వానాలు వచ్చినా తిరస్కరించి ప్రతిపక్ష నేతగా సమస్యలపై పోరాటాలు చేశారన్నారు. కొంతమంది పోలీసు అధికారులు తమ అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారని మధుయాష్కీగౌడ్ చెప్పారు. ప్రజాస్వామ్యబద్ధంగా వెళ్లాలని సీఎం రేవంత్ చెబుతుంటే.. విచారణ పేరుతో అర్థరాత్రి పూట అరెస్టులు చేస్తూ ప్రభుత్వాన్ని బదనాం చేస్తున్నారన్నారు. ప్రభుత్వం మారిందని, సీఎంగా రేవంత్ ఉన్నారని పోలీస్ అధికారులు గుర్తు పెట్టుకోవాలన్నారు.
ఈబీసీ కమిషన్‌ను ఏర్పాటు చేయాలి:జేఏసీ
ఈబీసీ కమిషన్‌ను, కార్పొరేషన్‌ను ఏర్పాటు చేయాలని మాజీమంత్రి జానారెడ్డిని కలిసి ఈబీసీ జేఏసీ నేతలు వినతిపత్రం సమర్పించారు. బంజారాహిల్స్‌లోని జానారెడ్డి నివాసంలో ఆయన్ను జేఏసీ చైర్మన్ వల్లపురెడ్డి రవీందర్‌రెడ్డి ఆధ్వర్యంలో 18 అగ్రకులాల నిరుపేదల సంఘాల ప్రతినిఽధులు కలిశారు. మొత్తం జనాభాలో 25ు అగ్రకులాల వారు ఉన్నారని, వారిలో అత్యధికులు నిరుపేదలు అని వినతి పత్రంలో పేర్కొన్నారు. రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు అమలు చేస్తున్న అన్ని అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అగ్రకులాల నిరుపేదలకు కూడా అమలయ్యేలా చూడాలని కోరారు. ప్రభుత్వ పెద్దలతో మాట్లాడి అగ్రకులాల నిరుపేదల సమస్యల పరిష్కారానికి సహాయ సహకారాలు అందిస్తానని జానారెడ్డి తెలిపినట్లు జేఏసీ పేర్కొంది.