Share News

గ్రూప్‌-1 కేసు వాదించినందుకు నాపై దాడులు..

ABN , Publish Date - Feb 03 , 2026 | 03:00 AM

బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో రెండోసారి నిర్వహించిన గ్రూప్‌-1 పరీక్ష లో అవకతవకలు జరిగాయని హైకోర్టులో పిటిషన్‌ వేసి వాదించినందుకు తనపై దాడులు జరుగుతున్నాయని న్యాయవాది...

గ్రూప్‌-1 కేసు వాదించినందుకు నాపై దాడులు..

  • రక్షణకు పోలీసులను ఆదేశించాలనిహైకోర్టులో న్యాయవాది పిటిషన్‌

బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో రెండోసారి నిర్వహించిన గ్రూప్‌-1 పరీక్ష లో అవకతవకలు జరిగాయని హైకోర్టులో పిటిషన్‌ వేసి వాదించినందుకు తనపై దాడులు జరుగుతున్నాయని న్యాయవాది, యూత్‌ కాంగ్రెస్‌ నాయకుడు బొమ్మరాజు నర్సింగ్‌ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. తనకు యాక్సిడెంట్‌ చేయడంతోపాటు కారు అద్దాలు పగలగొట్టారని.. తనను చంపుతామని హెచ్చరికలు జారీచేసిన వీడియోలు యూట్యూబ్‌లో ఉన్నాయని తెలిపారు. తనకు రక్షణ కల్పించాలని గవర్నర్‌కు, డీజీపీకి లిఖితపూర్వకంగా విజ్ఞప్తి చేసినా పట్టించుకోవటం లేదని తెలిపారు. తనకు రక్షణ కల్పించేలా డీజీపీకి ఆదేశాలు ఇవ్వాలని కోరారు. ఈ పిటిషన్‌పై జస్టిస్‌ ఎన్‌ తుకారాంజీ ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టి.. డీజీపీ, పోలీసుశాఖకు నోటీసులు జారీచేసింది.

Updated Date - Feb 03 , 2026 | 03:00 AM