Share News

స్థానిక సంస్థలకు రూ.11వేల కోట్లు ఇచ్చాం

ABN , Publish Date - Mar 06 , 2026 | 01:06 AM

గడచిన పదేళ్లలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలోని స్థానిక సంస్థలకు రూ. 11వేల కోట్లకు పైగా నిధులను విడుదల చేసిందని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు.

స్థానిక సంస్థలకు రూ.11వేల కోట్లు ఇచ్చాం

  • యూసీలు సమర్పిస్తే పంచాయతీలకు మరో రూ.2వేల కోట్లు

  • కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డి

హైదరాబాద్‌, మార్చి 5 (ఆంధ్రజ్యోతి): గడచిన పదేళ్లలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలోని స్థానిక సంస్థలకు రూ. 11వేల కోట్లకు పైగా నిధులను విడుదల చేసిందని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. 14, 15 ఆర్థిక సంఘాల సిఫారసులకు అనుగుణంగా రూ.14,110 కోట్లు కేటాయించగా, గత డిసెంబరు 31 నాటికి రూ.11,111కోట్లు విడుదల చేసినట్లు చెప్పారు. ఇటీవల ఎన్నికలు జరిగిన పంచాయతీలకు మూడు విడతల్లో రూ.1,034కోట్లు విడుదల చేసినట్లు కిషన్‌రెడ్డి వివరించారు. పంచాయతీలు.. ఖర్చులకు సంబంధించిన వినియోగ ధ్రువీకరణ పత్రాలు(యుటిలైజేషన్‌ సర్టిఫికెట్లు) కేంద్రానికి సమర్పించిన తర్వాత మిగతా రూ.2వేల కోట్లను విడుదల చేస్తామని ఒక ప్రకటనలో వివరించారు. గతంలో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పంచాయతీల బ్యాంకు ఖాతాలను అటాచ్‌ చేసి, కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన నిధులను ఇతర కార్యక్రమాల కోసం మళ్లించిందని ఆరోపించారు. ఫలితంగా, తాము చేసిన అభివృద్ధి పనులకు సంబంధించి నిధులు అందక పలువురు సర్పంచులు ఆత్మహత్య చేసుకున్నారని తెలిపారు. గ్రామాల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపరిచేందుకు, మోదీ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.

Updated Date - Mar 06 , 2026 | 01:06 AM