Share News

ఏపీకి పారిపదేళ్లు పత్తాలేరు.. వారిని నమ్మి మళ్లీ ఓట్లేయాలా?

ABN , Publish Date - Feb 03 , 2026 | 03:33 AM

పదేళ్ల పాటు ప్రజలను గాలికొదిలేసి.. ఇవాళ ఎన్నికలు రాగానే దండాలు పెట్టుకుంటూ వస్తున్న నాయకులను నమ్ముదామా? పేదోడికి ఓ రేషన్‌ కార్డు ఇవ్వడానికి మనసు రాని వాళ్లకు మళ్లీ ఓట్లు వేయాలా..

ఏపీకి పారిపదేళ్లు పత్తాలేరు.. వారిని నమ్మి మళ్లీ ఓట్లేయాలా?

  • ఏదులాపురాన్ని రోల్‌మోడల్‌గా చేస్తా: మంత్రి పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి

ఖమ్మం రూరల్‌, ఫిబ్రవరి 2 (ఆంధ్రజ్యోతి): ‘పదేళ్ల పాటు ప్రజలను గాలికొదిలేసి.. ఇవాళ ఎన్నికలు రాగానే దండాలు పెట్టుకుంటూ వస్తున్న నాయకులను నమ్ముదామా? పేదోడికి ఓ రేషన్‌ కార్డు ఇవ్వడానికి మనసు రాని వాళ్లకు మళ్లీ ఓట్లు వేయాలా?’ అని రెవెన్యూ, గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి.. బీఆర్‌ఎస్‌ నేతలనుద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఖమ్మం జిల్లా ఏదులాపురం మునిసిపాలిటీలోని పలు వార్డుల్లో సోమవారం ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రజలను ముంచింది కారు సర్కారు అయితే, గట్టెక్కించేది మాత్రం హస్తం ప్రభుత్వమేనని పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి భరోసానిచ్చారు. తాము అధికారంలోకి రాగానే అర్హులైన ప్రతి పేదవాడికి రేషన్‌ కార్డులు ఇచ్చి ఆకలి తీర్చామని, అది కాంగ్రెస్‌ మార్కు పాలన అని గుర్తు చేశారు. జూన్‌ నాటికి మున్నేరు కరకట్ట పనులు పూర్తి చేయిస్తామని, 690 కోట్లతో నిర్మించే రిటైనింగ్‌ వాల్‌ ఏదులాపురానికి రక్షణ కవచంలా మారుతుందని చెప్పారు. రాష్ట్రంలో మోడల్‌ మునిసిపాలిటీగా ఏదులాపురాన్ని నిలబెడతానని పేర్కొన్నారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థులను గెలిపించి, ప్రజా ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని కోరారు.

Updated Date - Feb 03 , 2026 | 03:33 AM