Share News

రాష్ట్రంలో రేవంత్‌ అరాచక పాలన

ABN , Publish Date - Mar 16 , 2026 | 04:05 AM

రాష్ట్రంలో సీఎం రేవంత్‌రెడ్డి అరాచక పాలన సాగిస్తున్నారని, హైడ్రా పేరుతో పేదల ఇళ్లను కూల్చివేస్తూ మరో మోదీలా వ్యవహరిస్తున్నారని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మండిపడ్డారు.

రాష్ట్రంలో రేవంత్‌ అరాచక పాలన

  • మూసీ భూములను ప్రపంచ బ్యాంక్‌కు కట్టబెట్టే కుట్ర

  • హైడ్రాను అడ్డుపెట్టుకుని పేదల ఇళ్ల కూల్చివేత

  • తప్పుడు ప్రచారం చేస్తున్న రంగనాథ్‌ను కోర్టుకీడుస్తా: కవిత

హైదరాబాద్‌, మార్చి 15 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో సీఎం రేవంత్‌రెడ్డి అరాచక పాలన సాగిస్తున్నారని, హైడ్రా పేరుతో పేదల ఇళ్లను కూల్చివేస్తూ మరో మోదీలా వ్యవహరిస్తున్నారని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మండిపడ్డారు. ఆదివారం తెలంగాణ జాగృతి కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ.. హైడ్రా పేదల ఇళ్లపైనే ప్రతాపం చూపిస్తోందని, పెద్దవాళ్ల జోలికి వెళ్లడంలేదని ఆరోపించారు. మూసీ ప్రక్షాళన పేరిట ప్రజాధనం దోచుకోవాలని చూస్తున్నారని, ఈ ప్రాజెక్టును ప్రపంచ బ్యాంక్‌కు తాకట్టు పెట్టేందుకు రేవంత్‌రెడ్డి ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. ఇళ్లు కోల్పోతున్న బాధితులతో కాకుండా రియల్‌ఎేస్టట్‌ వ్యాపారులు, ప్రపంచబ్యాంక్‌ ప్రతినిధులతో సమీక్షలు నిర్వహించడం వెనుక మతలబు ఏంటని ప్రశ్నించారు. మూసీ రివర్‌ ఫ్రంట్‌లో భాగంగా గత ప్రభుత్వం రివర్‌ బెడ్‌లో 30లక్షల చదరపు అడుగుల నిర్మాణాలకు సంబంధిత శాఖలు అనుమతి ఇవ్వలేదని, ఈ ప్రభుత్వం ఫేజ్‌-1లోనే 18లక్షల చదరపు అడుగుల నిర్మాణా లు చేపట్టేందుకు ఎలా అనుమతి ఇచ్చారని నిలదీశారు. వెలుగుమట్లలో 750 ఇళ్లను కూల్చివేసిన ప్రభుత్వం, బాధితులందరికి న్యాయం చేయడంలో విఫలమైందన్నారు. బాధితులకు న్యాయం జరిగే వరకు ధర్మ సమాజ్‌ పార్టీ, తెలంగాణ జాగృతి తరపున పోరాటం కొనసాగిస్తామన్నారు. తమపై సోషల్‌ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్న హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ను కోర్టుకు ఈడుస్తానని హెచ్చరించారు. ఓ ప్రముఖ భవన నిర్మాణ సంస్థ 0.37ఎకరాలు ఆక్రమించిందం టూ గతంలో హైడ్రా కమిషనర్‌ రాసినలేఖ ఆధారంగానే, ఇప్పుడు దానిపై తాము ధర్నా చేస్తే తప్పుడు వీడియోలతో ఎదురుదాడి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ధర్నాకు సంబంధించి సోషల్‌మీడియాలో హైడ్రా పెట్టిన వీడియోల ను వెంటనే తొలగించాలని డిమాండ్‌ చేశారు. నిజంమాట్లాడే వాళ్లదే తప్పు అన్నట్టుగా వీడియోలు ఎడిట్‌చేస్తారా?అని ప్రశ్నించారు. ప్రభుత్వం, హైడ్రా యం త్రాంగం ఏమైనా ‘గ్రాఫిక్స్‌ డిజైనర్లా, కంటెంట్‌ క్రియేటర్లా?’అంటూ విమర్శించారు.

Updated Date - Mar 16 , 2026 | 04:05 AM