కాంగ్రెస్ అసమర్థ పాలనలో విద్యార్థుల ప్రాణాలకు రక్షణలేదు
ABN , Publish Date - Feb 04 , 2026 | 03:17 AM
కాంగ్రెస్ అసమర్థ పాలనలో విద్యార్థుల ప్రాణాలకు రక్షణలేకుండా పో తోందని, గురుకులాలు, హాస్టళ్లల్లో కలుషిత ఆహారం, ఆత్మహత్యలు, పాముకాట్లు వంటి ఘటనలు జరుగుతున్నా...
రేవంత్‌రెడ్డి మొద్దునిద్ర వీడాలి: కవిత
హైదరాబాద్, పిబ్రవరి 3 (ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్ అసమర్థ పాలనలో విద్యార్థుల ప్రాణాలకు రక్షణలేకుండా పో తోందని, గురుకులాలు, హాస్టళ్లల్లో కలుషిత ఆహారం, ఆత్మహత్యలు, పాముకాట్లు వంటి ఘటనలు జరుగుతున్నా ప్ర భుత్వం పట్టించుకోవడంలేదని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆరోపించారు. మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి మండలంలోని బాలికల గురుకుల కళాశాలలో విద్యార్థిని అశ్మిత పాము కాటుకు గురి కావడం తనను కలచివేసిందని మంగళవారం ఎక్స్ వేదికగా ఆమె పేర్కొన్నారు. విద్యాశాఖనుకూడా నిర్వహిస్తున్న సీఎం రేవంత్‌రెడ్డి ఇకనైనా మొద్దునిద్ర వీడి అస్తవ్యస్తంగా మారిన గురుకులాలను, సంక్షేమహాస్టళ్లను గాడిన పెట్టాలన్నారు. పాము కాటుకు గురైన అశ్మితకు మె రుగైన వైద్యం అందించాలని ఆమె డిమాండ్ చేశా రు. కాగా, పదేళ్లు బీఆర్‌ఎస్, రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో మునిసిపాలిటీలు, కార్పొరేషన్ల అభివృద్ధి కోసం ఏమీ చేయలేదని తెలంగాణ జాగృతి ప్రధానకార్యదర్శి నవీన్‌ఆచారి, ఉపాధ్యక్షుడు కోళ్లశ్రీనివాస్ ఆరోపించారు. మంగళవారం జాగృతి కార్యాలయంలో వారు మాట్లాడుతూ.. మునిసిపాలిటీలకు ఏంచేశాయని ఆ పార్టీలకు ఓట్లు వేయాలని ప్రశ్నించారు.