కాకతీయ మెగా టెక్స్‌టైల్స్ పార్క్ డీపీఆర్‌కి ఓకే
ABN , Publish Date - Feb 04 , 2026 | 03:15 AM
వరంగల్‌లో రూ.1,696 కోట్ల అంచనా వ్యయంతో స్థాపిస్తున్న కాకతీయ మెగా టెక్స్‌టైల్స్ పార్కు డీపీఆర్‌ను ఆమోదించినట్లు కేంద్రం తెలిపింది...
రూ. 1,696 కోట్ల వ్యయం.. లోక్‌సభలో కేంద్రం వెల్లడి
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 3 (ఆంధ్రజ్యోతి): వరంగల్‌లో రూ.1,696 కోట్ల అంచనా వ్యయంతో స్థాపిస్తున్న కాకతీయ మెగా టెక్స్‌టైల్స్ పార్కు డీపీఆర్‌ను ఆమోదించినట్లు కేంద్రం తెలిపింది. లోక్‌సభలో మంగళవారం తెలంగాణ ఎంపీలు ఈటల రాజేందర్, కిరణ్‌కుమార్‌రెడ్డి అడిగిన ప్రశ్నల కు కేంద్ర మంత్రి పబిత్ర మార్గరీటా సమాధానం ఇచ్చారు. పీఎం మిత్ర పథకం కింద 2027-28 వరకు దేశవ్యాప్తంగా ఏడు టెక్స్‌టైల్ పార్కుల కోసం రూ.4,445 కోట్లు కేటాయుంచినట్లు చెప్పారు. వరంగల్‌లోని కాకతీయ మెగా టెక్స్‌టైల్స్ పార్క్‌లో ఇప్పటికే రూ.3,862 కోట్ల విలువైన పెట్టుబడులు గ్రౌండింగ్ అయ్యాయని చెప్పారు. ఈ పార్క్‌కు పీఎం మిత్ర కింద తొలి విడతగా రూ.30 కోట్లు విడుదల చేసినట్లు పేర్కొన్నారు.