Share News

జనగామ కలెక్టర్‌ పేరిట ఫేక్‌ ‘సోషల్‌’ ఖాతాలు

ABN , Publish Date - Feb 04 , 2026 | 03:00 AM

సైబర్‌ నేరగాళ్లు అమాయకులను బురిడీ కొట్టించడానికి రోజుకో ఎత్తు వేస్తున్నారు. రూట్‌ మారుస్తున్నారు. తాజాగా కలెక్టర్‌ పేరిట సోషల్‌ మీడియా వేదికలపై నకిలీ ..

జనగామ కలెక్టర్‌ పేరిట ఫేక్‌ ‘సోషల్‌’ ఖాతాలు

  • అమాయకుల బురిడీకి సైబర్‌ నేరగాళ్ల యత్నం

  • ఆకతాయిల మోసాలకు గురి కావద్దు: జనగామ కలెక్టర్‌

జనగామ, ఫిబ్రవరి 3 (ఆంధ్రజ్యోతి): సైబర్‌ నేరగాళ్లు అమాయకులను బురిడీ కొట్టించడానికి రోజుకో ఎత్తు వేస్తున్నారు. రూట్‌ మారుస్తున్నారు. తాజాగా కలెక్టర్‌ పేరిట సోషల్‌ మీడియా వేదికలపై నకిలీ ఖాతాలు తెరిచి అమాయకులను మోసగించేందుకు సైబర్‌ నేరగాళ్లు చేసిన ప్రయత్నం జనగామ జిల్లాలో చోటు చేసుకుంది. సోషల్‌ మీడియా వేదికలు ఇన్‌స్టాగ్రాం, వాట్సా్‌పల్లో జిల్లా కలెక్టర్‌ షేక్‌ రిజ్వాన్‌ బాషా పేరిట మంగళవారం ఫేక్‌ అకౌంట్లను తెరిచారు. ఏకంగా కలెక్టర్‌ ఫొటోను డీపీగా పెట్టిన ఈ నకిలీ ఖాతాల నుంచి.. ‘హాయ్‌.. నువ్వు నీ ఫ్యామిలీ ఎలా ఉన్నారు’ అని సైబర్‌ మోసగాళ్లు పంపిన మెసేజ్‌లకు తొలుత కొందరు రిప్లయ్‌ ఇచ్చినా.. తర్వాత దాన్ని నకిలీ ఖాతాగా అనుమానించి కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లారు. కలెక్టర్‌ రిజ్వాన్‌ బాషా వెంటనే స్పందించి సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన ప్రొఫైల్‌తో వచ్చే సోషల్‌ మీడియా మెసేజ్‌లకు ఎవరూ స్పందించొద్దని అధికారులను, ప్రజలను కోరిన కలెక్టర్‌.. ఆకతాయిల సైబర్‌ మోసాలకు గురి కావద్దని హితవు చెప్పారు.

Updated Date - Feb 04 , 2026 | 03:00 AM