Share News

పురపోరులో సింహం గుర్తుపై జాగృతి అభ్యర్థుల పోటీ

ABN , Publish Date - Jan 29 , 2026 | 05:56 AM

తెలంగాణలోని పురపాలక సంఘాల్లో ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో ఇంకా రాజకీయ పార్టీగా ఏర్పడకపోవడంతో...

పురపోరులో సింహం గుర్తుపై జాగృతి అభ్యర్థుల పోటీ

  • కవితతో భేటీ అయిన ఏఐఎ్‌ఫబీ నేతలు

తెలంగాణలోని పురపాలక సంఘాల్లో ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో ఇంకా రాజకీయ పార్టీగా ఏర్పడకపోవడంతో తెలంగాణ జాగృతి అభ్యర్థులు ఆల్‌ ఇండియా ఫార్వర్డ్‌ బ్లాక్‌ (ఏఐఎ్‌ఫబీ)కు చెందిన సింహం గుర్తుపై పోటీచేయాలని నిర్ణయించుకున్నారు. ఈమేరకు బంజారాహిల్స్‌లోని ప్రధాన కార్యాలయంలో జాగృతి అధ్యక్షురాలు కవితతో ఏఐఎ్‌ఫబీ పార్టీ ప్రతినిధులు భేటీ అయ్యారు. మునిసిపల్‌ ఎన్నికల్లో జాగృతి మద్దతుదారులు సింహం గుర్తుతో పోటీచేయాలని, ఇందుకు తమ సహకారం ఉంటుందని ఏఐఎ్‌ఫబీ రాష్ట్ర అధ్యక్షుడు జావెద్‌ లతీఫ్‌, ఉపాధ్యక్షులు కె.బుచ్చిరెడ్డి, తదితరులు ప్రకటించారు. మరోవైపు తమ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వాన్ని నిలదీస్తామని ఆటో డ్రైవర్లకు కల్వకుంట్ల కవిత హామీ ఇచ్చారు. వివిధ ఆటో యూనియన్‌ల నాయకులతో సమావేశమైన ఆమె.. హైదరాబాద్‌లో ఇతర జిల్లాల నుంచి వచ్చిన ఆటో డ్రైవర్లపై జరుగుతున్న దాడులు, వేధింపులపై ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఆటోడ్రైవర్లకు ఇస్తామన్న రూ.12 వేల సాయాన్ని వెంటనే ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఆటో డ్రైవర్ల సమస్యల పరిష్కారం కోసం పోరాటం చేస్తామని, అవసరమైతే కార్మికశాఖ మంత్రిని కలుస్తామన్నారు.

Updated Date - Jan 29 , 2026 | 05:56 AM