ఇస్నాపూర్ వైస్ చైర్మన్‌పై అనర్హత వేటు
ABN , Publish Date - Mar 04 , 2026 | 03:06 AM
సంగారెడ్డి జిల్లా ఇస్నాపూర్ మునిసిపాలిటీలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారిపోయాయి. పార్టీ విప్‌ను ధిక్కరించిన వైస్ చైర్మన్ పట్లోళ్ల మాధవిపై నరేందర్‌రెడ్డిపై ఎన్నికల అధికారి.....
విప్ ఉల్లంఘించి బీఆర్‌ఎస్‌కు ఓటేసిన
పట్లోళ్ల మాధవిపై చర్యలు తీసుకున్న ఎన్నికల అధికారి
పటాన్‌చెరు రూరల్, మార్చి 3 (ఆంధ్రజ్యోతి): సంగారెడ్డి జిల్లా ఇస్నాపూర్ మునిసిపాలిటీలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారిపోయాయి. పార్టీ విప్‌ను ధిక్కరించిన వైస్ చైర్మన్ పట్లోళ్ల మాధవిపై నరేందర్‌రెడ్డిపై ఎన్నికల అధికారి అనర్హత వేటు వేశారు. కాంగ్రెస్ తరఫున గెలిచి బీఆర్‌ఎ్‌సకు మద్దతు తెలపడంపై విచారణ చేపట్టిన అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇస్నాపూర్ మునిసిపాలిటీలోని చిట్కుల్ (8వ వార్డు) నుంచి పట్లోళ్ల మాధవి కాంగ్రెస్ అభర్థిగా విజయం సాధించారు. చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికల సమయంలో ఆమె అనూహ్యంగా బీఆర్‌ఎస్ పంచన చేరారు. కాంగ్రెస్ పార్టీ చైర్మన్ అభ్యర్థిగా నీలం కవితను ఖరారు చేస్తూ విప్ జారీ చేసినప్పటికీ, మాధవి మాత్రం విప్‌ను ధిక్కరించి బీఆర్‌ఎస్ అభ్యర్థికి ఓటు వేశారు. ఈ క్రమంలో ఆమె బీఆర్‌ఎస్ మద్దతుతో వైస్ చైర్మన్‌గా కూడా ఎన్నికయ్యారు. మాధవి పార్టీ ఫిరాయింపుపై సంగారెడ్డి డీసీసీ అధ్యక్షురాలు నిర్మలా జగ్గారెడ్డి ఎన్నికల అధికారి శ్రీకాంత్‌కు ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన ఆయన మాధవి నరేందర్ రెడ్డిపై అనర్హత వేటు వేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. వైస్ చైర్మన్ పదవితో పాటు మాధవి తన కౌన్సిలర్ సభ్యత్వాన్ని కూడా కోల్పోయారు. దీంతో ప్రస్తుతం 8వ వార్డు ఖాళీగా ఉన్నట్లు మునిసిపల్ కమిషనర్ వెంకటకిషన్ రావు అధికారికంగా ప్రకటించారు.