Share News

ఇన్‌ సర్వీస్‌ ఉపాధ్యాయుల టెట్‌ సమస్యను పరిష్కరిస్తాం

ABN , Publish Date - Feb 03 , 2026 | 02:58 AM

ఇన్‌ సర్వీస్‌ ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న ఉపాధ్యాయ అర్హతా పరీక్ష (టెట్‌) సమస్యను పరిష్కరిస్తామని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ అన్నారు.

ఇన్‌ సర్వీస్‌ ఉపాధ్యాయుల టెట్‌ సమస్యను పరిష్కరిస్తాం

  • ఉపాధ్యాయ ఎమ్మెల్సీలతో కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌

హైదరాబాద్‌, ఫిబ్రవరి 2 (ఆంధ్రజ్యోతి): ఇన్‌ సర్వీస్‌ ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న ఉపాధ్యాయ అర్హతా పరీక్ష (టెట్‌) సమస్యను పరిష్కరిస్తామని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ అన్నారు. ఉపాధ్యాయ శాసనమండలి సభ్యులు పింగిలి శ్రీపాల్‌ రెడ్డి, మల్క కొమరయ్య, పీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు పుల్గం దామోదర్‌ రెడ్డి, సుంకరి భిక్షం గౌడ్‌ సోమవారం కేంద్ర మంత్రిని పార్లమెంటు ఆవరణలో కలిశారు. సుప్రీం కోర్టు తీర్పు నేపథ్యంలో తెలంగాణతోపాటు దేశవ్యాప్తంగా సర్వీసులో ఉన్న ప్రభుత్వ ఉపాధ్యాయులు ఉద్యోగాలు కోల్పోయే పరిస్థితి వచ్చిందని, కేంద్రం వెంటనే జోక్యం చేసుకోవాలని ఎమ్మెల్సీలు విజ్ఞప్తి చేశారు. కేంద్ర మంత్రి స్పందిస్తూ. దీనిపై న్యాయపరమైన సలహా తీసుకుని కేంద్రం తగు చర్యలు తీసుకుంటుందని హామీ ఇచ్చారని ఎమ్మెల్సీలు తెలిపారు.

Updated Date - Feb 03 , 2026 | 02:58 AM