Share News

ట్రిప్పుకు రూ. 60 వేల కమీషన్‌

ABN , Publish Date - Mar 03 , 2026 | 03:37 AM

ఆంధ్రా, ఒడిసా రాష్ట్రాల నుంచి హైదరాబాద్‌ మీదుగా మహారాష్ట్ర, కర్నాటకకు గంజాయిని తరలిస్తున్న ముఠా గుట్టును హైదరాబాద్‌ పోలీసులు రట్టు చేశారు. ఒడిసాలోని....

ట్రిప్పుకు రూ. 60 వేల కమీషన్‌

  • గంజాయి ముఠా గుట్టురట్టు.. 164 కేజీల స్వాధీనం..ఇద్దరి అరెస్టు..

హైదరాబాద్‌ సిటీ, మార్చి 2(ఆంధ్రజ్యోతి): ఆంధ్రా, ఒడిసా రాష్ట్రాల నుంచి హైదరాబాద్‌ మీదుగా మహారాష్ట్ర, కర్నాటకకు గంజాయిని తరలిస్తున్న ముఠా గుట్టును హైదరాబాద్‌ పోలీసులు రట్టు చేశారు. ఒడిసాలోని భరంపురం నుంచి హైదరాబాద్‌కు గంజాయి సరఫరా చేస్తున్నారన్న విశ్వసనీయ సమాచారం మేరకు మల్కాజిగిరి కంటోన్మెంట్‌ ఎస్‌వోటి టీమ్‌, అబ్ధుల్లాపూర్‌మెట్‌ పోలీసులు సంయుక్త ఆపరేషన్‌ నిర్వహించి ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 164.86 కిలోల గంజాయితో పాటు గంజాయి తరలిస్తున్న కారును స్వాధీనం చేసుకున్నారు. ఒడిసాలోని గజపతి జిల్లాకు చెందిననబీన్‌ సబార్‌, సుధాకర్‌ను అదుపులోకి తీసుకున్నారు. వీరు ఒక్కో ట్రిప్పునకు రూ.60వేల చొప్పున కమీషన్‌ ఇస్తున్నట్లు గుర్తించారు. స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ రూ.41లక్షలు ఉంటుందని డీసీపీ వెల్లడించారు.

Updated Date - Mar 03 , 2026 | 03:37 AM