హార్వర్డ్‌లో రేవంత్ కాస్ట్‌లీ చదువు
ABN , Publish Date - Feb 04 , 2026 | 03:53 AM
ఒకవైపు హార్వర్డ్ యూనివర్సిటీలో కాస్ట్‌లీ చదువులతో సీఎం రేవంత్‌రెడ్డి ఫొటోలకు ఫోజులిస్తుంటే.. మరోవైపు గురుకులాల్లోని పేదవిద్యార్థులు పాముకాట్లకు గురయి...
గురుకులాల విద్యార్థులకేమో పాముకాట్లు: హరీశ్‌రావు
హైదరాబాద్, పిబ్రవరి 3 (ఆంధ్రజ్యోతి): ఒకవైపు హార్వర్డ్ యూనివర్సిటీలో కాస్ట్‌లీ చదువులతో సీఎం రేవంత్‌రెడ్డి ఫొటోలకు ఫోజులిస్తుంటే.. మరోవైపు గురుకులాల్లోని పేదవిద్యార్థులు పాముకాట్లకు గురయి ప్రాణాలమీదకు తెచ్చుకుంటున్నారని ఎమ్మెల్యే హరీశ్‌రావు పేర్కొన్నారు. మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి గురుకులంలో ఇంటర్ విద్యార్థిని అశ్మిత పాముకాటుకు గురై మృత్యువుతో పోరాడుతున్న వార్త తనను కలచివేస్తోందన్నారు. ఇది విద్యాశాఖను కూడా నిర్వహించే.. మీ పరిపాలనా వైఫల్యం కాదా? అని సీఎం రేవంత్‌రెడ్డిని ప్రశ్నించారు.